షాకింగ్: రూ.150 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్.. నో ఎందుకు చెప్పాడంటే..

  • IndiaGlitz, [Wednesday,June 23 2021]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. బాలీవుడ్ తారలు సైతం చిన్నబోయేలా ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు.

ఇదీ చదవండి: హాట్ టాపిక్ గా మారిన రవితేజ రెమ్యునరేషన్

క్రేజ్ ఉన్న స్టార్స్ దగ్గరికి కార్పొరేట్ సంస్థలు వాలిపోతుంటాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకోవడం కోసం స్టార్స్ ని తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్టు కుదుర్చుకుంటుంటాయి. క్రికెటర్లు, సినీ తారలు ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులవుతూ ఉంటారు.

క్రికెట్ కు, సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ఎండార్స్మెంట్ కోసం ప్రభాస్ ని సంప్రదించాయట. ఇందులో కేవలం కొన్నింటికి మాత్రమే ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలినవన్నీ ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.

అలా ప్రభాస్ గత ఏడాది కాలంగా రిజెక్ట్ చేసిన ఎండార్స్మెంట్ విలువ రూ 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టులని ప్రభాస్ వదులుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తాను ఎండార్స్ చేస్తున్న వాటిని కొనసాగిస్తూనే కొత్త బ్రాండ్స్ విషయంలో సెలెక్టివ్ గా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

తనకు ఉన్న అభిమానులని దృష్టిలో పెట్టుకుని అన్ని బ్రాండ్స్ ని ఓకే చేసేందుకు సిద్ధంగా ప్రభాస్ లేదు. అభిమానుల్లో తనపై నమ్మకం చిరకాలం కొనసాగేలా ఉండే బ్రాండ్స్ కి మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండడం కూడా ఓ కారణం. తన బిజీ షెడ్యూల్ దృష్ట్యా ప్రభాస్ అన్ని బ్రాండ్ కి ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.

More News

తాప్సీ చిత్రం నుంచి దర్శకుడు అవుట్.. కారణం ఇదే!

ప్రస్తుతం వెండితెరపై క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.

మహేష్ రిలీజ్ చేసిన 'హీరో' టీజర్.. కౌబాయ్, జోకర్ గెటప్పుల్లో అశోక్ గల్లా

సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ మేనల్లుడిగా అశోక్ గల్లా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

హాట్ టాపిక్ గా మారిన రవితేజ రెమ్యునరేషన్

మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్' చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి 'వీసీ'గా కరణం మల్లీశ్వరి!

తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఖాతాలో మరో ఘనత చేరింది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి.

జీవిత డేరింగ్ డెసిషన్.. ప్రకాష్ రాజ్, విష్ణుపై పోటీ?

టాలీవుడ్ లో మా ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. మొదట విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.