close
Choose your channels

టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన షూటింగ్‌లు, యూనియన్ ఆఫీసులకు కార్మికులు

Wednesday, June 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్‌లో సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు జరిగే వరకు షూటింగ్‌లకు హాజరయ్యేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెబుతున్నాయి. వీరిని బుజ్జగించేందుకు సినీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బుధవారం నుంచి చిత్ర పరిశ్రమలోని 24 యూనియన్ల సభ్యులు సమ్మెకు దిగుతున్నట్లు తెలుగు ఫిలిం ఫెడరేషన్ స్పష్టం చేసింది.

ఎన్నిసార్లు చెప్పినా నిర్మాతల మండలి పట్టించుకోలేదు:

దీనిపై తెలుగు ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ వల్లభనేని మీడియాతో మాట్లాడుతూ… కార్మికులకు వేతనాలు పెంచాలని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తరపున నిర్మాతల మండలిని పలుమార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. తమకు పెంచాల్సిన వేతనాలు ఏడాదిన్నర ఆలస్యమవుతున్నా సినీ కార్మికులు ఓపిక పట్టారని.. కానీ ఇప్పుడు వారు సహనం కోల్పోయారని అనిల్ అన్నారు. చివరికి తమ మాట కూడా వినడం లేదని, సినీ కార్మికుల సమ్మె నిర్ణయం న్యాయమైనదని ఆయన తెలిపారు. సమ్మె కోరుకుంటున్నారా లేక సజావుగా షూటింగ్స్‌ జరగాలా అనే విషయంలో నిర్మాతల మండలిదే తుది నిర్ణయమని అనిల్ పేర్కొన్నారు.

ఆఫీసులకు చేరుకుంటున్న కార్మికులు:

మరోవైపు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. యూసఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో వుంటున్న తమ యూనియన్ ఆఫీస్‌లకు వందలాది మంది కార్మికులు చేరుకుంటున్నారు. అటు జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు, ఇతర వాహనాలను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. ఉదయం పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు భేటీ కానున్నారు.

15 చిన్నా పెద్దా సినిమాలపై సమ్మె ప్రభావం:

కార్మికుల సమ్మె కారణంగా ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్న పెద్ద సినిమాలపై ప్రభావం పడనుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూడు సినిమాలు, ప్రభాస్ - నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కే, చరణ్- శంకర్ మూవీ, గోపీచంద్ మలినేని- బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ - వెంకటేశ్ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో పాటు మొత్తం 15 చిన్నా పెద్దా సినిమాలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.