close
Choose your channels

రక్తం మరుగుతోంది.. ఇక 2.0 సర్జికల్ దాడులే!?

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రక్తం మరుగుతోంది.. ఇక 2.0 సర్జికల్ దాడులే!?

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  అనంతరం అమరులైన జవాన్లకు ఢిల్లీలో నివాళులర్పించి.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు మోదీ. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఉగ్రమూకలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇందులో ఎలాంటి సందేహాల్లేవన్నట్లుగా మోదీ చెప్పుకొచ్చారు.

మోదీ మాటల్లోనే..

"అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటాము. జవాన్ల సాహసంపై పూర్తి నమ్మకం ఉంది. భారత్‌లో అస్థిరత్వం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగనిచ్చేది లేదు. ఇలాంటి అమానీయ ఘటనలకు పాల్పడుతున్న ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న పాక్‌పైనా ప్రతీకారం తీర్చుకునే తీరుతాం. జవాన్లపై జరిగిన దాడితో 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోతోంది. దానికి దీటైన సమాధానం కచ్చితంగా చెప్పి తీరుతాం. ఉగ్రవాదంపై మానవాళి అంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. అమరుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా అందరూ కలిసి పోరాడాలి" అని మోదీ తెలిపారు.

సర్జికల్ దాడులు 2.0 తప్పదా..!?

కాగా మోదీ ప్రసంగించిన తీరును బట్టి చూస్తే మరోసారి ‘సర్జికల్ స్ట్రైక్‌‌’ చేయాలని సైన్యాన్ని ఆదేశించనున్నారా..? భారత్ కచ్చితంగాత తీవ్రమైన ఎదురుదాడి చేయబోతోందా..? అనే పశ్నలు భారతీయల మనస్సుల్లో మెదులుతున్నాయి. మరీ ముఖ్యంగా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని.. ఇందులో ఎలాంటి సందేహాం లేదని గుణపాఠం చెప్పి తీరుతామని మోదీ చెప్పడంతో సర్జికల్ స్ట్రైక్స్ తప్పవనే స్పష్టమవుతోంది. కాగా ఇప్పటికే ఓ సారి చేసిన సర్జికల్ స్ట్రైక్-1 అనుకుంటే... త్వరలో జరగబోయే స్ట్రైక్స్‌‌ను 2.0 అనుకోవచ్చేమో..!

పాక్‌కు షాక్!

పాక్‌కు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను భారత్ ఉపసంహరించుకుంటోందని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఉగ్రవాదంపై భారత పోరాటాన్ని మరింత పదునెక్కిస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా పాక్‌ను ఒంటరి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ తెలిపారు. పాక్‌తో దౌత్య సంబంధాలను ఉపసంహరించుకునేలా ఆయా దేశాలను కోరుతామని ఈ సందర్భంగా జైట్లీ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ మద్దతు..

పుల్వామా ఘటన విషయంలో కేంద్రానికి పలువురు ప్రముఖులు మద్దుతు తెలుపుతున్నారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సైతం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది విషాదరకర సందర్భమని.. ఈ విషయంలో మేము కేంద్రానికి, భద్రతా బలగాలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. జవాన్ల కుటుంబాలకు మేము అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. మరోవైపు మాజీ ప్రధాని మాట్లాడుతూ.. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. ఉగ్రవాదం విషయంలో అందరితో కలిసి పనిచేస్తామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.