మంచు మనోజ్ శౌర్య ఫస్ట్ సాంగ్ రిలీజ్...

  • IndiaGlitz, [Saturday,December 26 2015]

మంచు మ‌నోజ్, రెజీనా జంట‌గా న‌టిస్తున్న చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కిస్తున్నారు. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శివ‌కుమార్ నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీ గా రూపొందుతున్న శౌర్య షూటింగ్ పూర్తి చేసుకుంది. జ‌న‌వ‌రి నెలాఖ‌రున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. క్రిస్మెస్ కానుక‌గా శౌర్య సినిమాలో ఫ‌స్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ...ఇటీవ‌ల రిలీజ్ చేసిన శౌర్య మోష‌న్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గీత ర‌చ‌యిత క్రిష్ణ చైత‌న్య రాసిన పాట‌ను ఈరోజు లాంఛ్ చేసాం. ఈ సినిమాలో మ‌నోజ్ ను స‌రికొత్త‌గా చూపిస్తున్నాం. ఫ్యామిలీ అంతా క‌ల‌సి చూసే మంచి సినిమా ఇది అన్నారు.

హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ... ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన శౌర్య నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది అన్నారు.

నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ...ద‌శ‌ర‌థ్ గారి ప్లానింగ్ తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న టైం కి పూర్తి చేసాం. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్ లో ఆడియోను, జ‌న‌వ‌రి నెలాఖ‌రున సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మంలో శివారెడ్డి, నందు, జీవి, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

'మనం' పరువు నిలబెట్టేలా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఉంటుంది - నాగ్

కింగ్ నాగార్జున,రమ్యకృష్ణ,లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

'జత కలిసే' మూవీ రివ్యూ

కొన్ని సినిమాల పోస్టర్లను చూసి సినిమా మీద అంచనాలు పెంచుకోవచ్చు. అందులో నటించిన తారల గత సినిమాలు హిట్ అయితే ఈ సినిమాలపై అంచనాలు పెరగడం మామూలే. మరోవైపు సినిమాను చూసి నచ్చి అసోసియేట్ అయ్యే వారిని బట్టి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ నిర్ణయానికి రావచ్చు.

మామ మంచు - అల్లుడు కంచు మూవీ రివ్యూ

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మామ మంచు అల్లుడు కంచు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన అల్లరి మొగుడుకు సీక్వెల్ లా ఉంటుందీ సినిమా. హీరోకి పెళ్ళయ్యే సన్నివేశంతో అల్లరి మొగుడు పూర్తవుతుంది. ఆ తర్వాత అతనికి పిల్లలు పుట్టాక ఏమైందనే అంశంతో తాజా సినిమా మొదలవుతుంది.

'భలే మంచి రోజు' మూవీ రివ్యూ

ఎప్పుడో ప్రేమ కథాచిత్రమ్ తో సక్సెస్ అందుకున్న సుధీర్ బాబుకు తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ సక్సెస్ ను కట్టబెట్టలేక పోయాయి. అందుకే తనకి కొత్త జోనర్ అయిన క్రైమ్ కామెడిలో సినిమాలో నటించాడు. సినిమాను కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య చేతిలో పెట్టాడు.

ఎన్టీఆర్..కి ఎన్ ఈసారైనా కలిసొచ్చేనా..

ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.ఇక సినిమా వాళ్లకు అయితే..సెంటిమెంట్ మరీ ఎక్కువుగా ఉంటుంది.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే...