close
Choose your channels

నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!

Monday, June 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజా శ్రద్దా దాస్ స్మోకింగ్ చేస్తున్న ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటో శ్రద్ధా నటిస్తున్న ఓ చిత్రంలోని వర్కింగ్ స్టిల్. ఈ ఫోటోపై శ్రద్దా దాస్ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. 'నాకు సిగరెట్ స్మోకింగ్ నచ్చదు. కానీ నటిగా ఉన్నప్పుడు నచ్చనవి కూడా చేయాల్సి ఉంటుంది' అని శ్రద్దా తెలిపింది.

అది డమ్మీ సిగరెట్టా లేక నిజంగానే కాల్చావా అని ఓ అభిమాని అడగగా నిజమే అని సమాధానం ఇచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్య 2, డార్లింగ్, గరుడవేగ లాంటి చిత్రాలు శ్రద్దా దాస్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.