హెచ్చ‌రిక‌..న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా:  శ్ర‌ద్ధాదాస్‌

  • IndiaGlitz, [Monday,July 27 2020]

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని నిర్వాహ‌కులు అధికారికంగా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ మొద‌టి వారంలో బిగ్‌బాస్ 4 స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా.. సోష‌ల్ మీడియాలో బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ వీరేనంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అలా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అని వినిపిస్తున్న వారి పేర్ల‌లో శ్ర‌ద్ధాదాస్ పేరు కూడా వినిపించింది. ఈ వార్త‌ల‌ను ఇది వ‌ర‌కే శ్ర‌ద్ధాదాస్ ఖండింది. ఇప్పుడు మ‌రోసారి శ్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్ 4లో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై శ్ర‌ద్ధాదాస్ సీరియ‌స్ అయ్యారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం త‌న‌నెవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని తెలిపారు శ్ర‌ద్ధా.

‘‘బిగ్‌బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేయాలంటూ నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. కానీ నేను బిగ్‌బాస్‌లో పాల్గొన‌బోతున్నానంటూ వార్త‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అయితే అలాంటి వార్త‌లు రాసే ముందు న‌న్ను సంప్ర‌దించి రాస్తే బావుంటుంది. అలా కాకుండా ఏదీ ప‌డితే అది రాస్తే ఊరుకునేది లేదు. వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాను. ఇదే నా మొద‌టి చివ‌రి హెచ్చ‌రిక’’ అంటూ శ్ర‌ద్ధాదాస్ వార్నింగ్ ఇచ్చారు.

More News

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో భారీ చిత్రం

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ‘సోనూసూద్’. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కరోనా మహమ్మారి

ఫ్యాన్స్ సంద‌డితో మ‌హేశ్ స‌రికొత్త రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన న‌టుడ‌ని కూడా చెప్పొచ్చు.

క‌రోనా దెబ్బ... రూ.2 కోట్లు న‌ష్టం

హీరోగా, నిర్మాత‌గా సినిమాలు చేస్తున్నారు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.

‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ నుండి వచ్చే ఇచ్చే స‌ర్‌ప్రైజ్ అదేనా?

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’