ఆ జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయంటున్న శ్రియ‌

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న‌ అతి కొద్ది మంది తార‌ల్లో అందాల తార శ్రియ ఒక‌రు. ఇటీవ‌ల శ్రియ నాగార్జున ఊపిరి చిత్రంలో క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా శ్రియ‌ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రంతో పాటు శ్రియ శింబుతో క‌లిసి ఎఎఎ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని అధిక్ ర‌విచంద్ర‌న్ తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్ లో ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతుంది.

ఈ మూవీ సెట్ లో ఓ పాత కారుతో క‌లిసి ఫోటో దిగిన శ్రియ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. అంతే కాదండోయ్...ఈ ఫోటో మా ఫ‌స్ట్ కారు ఆర్ఎన్డీ 5761 జ్ఞాప‌కాల‌ను, డ్రైవింగ్ నేర్చుకున్న రోజుల‌ను గుర్తుచేస్తుంది అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే...శింబు సినిమా కోసం శ్రియ చ‌క్క‌గా చీర‌లో చాలా అందంగా, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో సెల్వీ అనే శ్రియ పాత్ర హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అధిక్ ర‌విచంద్ర‌న్ తెలిపారు. మ‌రి..శ్రియ ఈ సినిమాతోనైనా త‌మిళ్ లో వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుందేమో చూడాలి.