close
Choose your channels

శ్రియ పెళ్లి డేట్ ఖరారు

Wednesday, February 28, 2018 • తెలుగు Comments

హీరోయిన్ శ్రియ పెళ్లిపై వార్త‌లు మ‌రోసారి ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవ‌ల పెళ్లిపై వ‌చ్చిన వార్త‌ల‌పై శ్రియా శ‌ర‌న్ సీరియ‌స్ అయిన సంగతి తెలిసిందే. మ‌రోసారి వార్త‌లు వ‌స్తుండ‌టం విశేషం. అయితే ఈసారి ఏకంగా ఆమెకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింద‌నే వార్త‌లు రావ‌డం గ‌మ‌నార్హం. ఉద‌య్‌పూర్‌లో మార్చి 17,18,19 తేదీల్లో ఈ పెళ్లి జరుగునుంది. త‌న ద‌గ్గ‌రి స్నేహితులు, శ్రేయోభిలాషుల‌కు శ్రియా పెళ్లికార్డులు కూడా పంచేసిందంటున్నారు.

ఇంత‌కు శ్రియ‌ను పెళ్లి చేసుకోబోతున్న‌దెవ‌రో తెలుసా? ర‌ష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపార వేత్త అండ్రూ కొచీవ్‌ను శ్రియా హిందూ ప‌ద్ధ‌తిలో వివాహం చేసుకోనున్నార‌ని తెలుస్తుంది. రీసెంట్‌గా గాయ‌త్రి సినిమాలో న‌టించిన శ్రియా ఇప్పుడు వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమాతో పాటు ద్విభాషా చిత్రం న‌ర‌గాసుర‌న్‌, హిందీ సినిమా త‌డ్కాలో న‌టిస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz