శ్రియ ఆ సినిమా చేయ‌డం లేదా?

  • IndiaGlitz, [Monday,April 02 2018]

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘ఆటా నాదే వేటా నాదే’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ మరో కథానాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈషా రెబ్బా.. నారా రోహిత్‌తో కలిసి తెరను పంచుకోనుంద‌ని స‌మాచార‌మ్‌. నేటి విద్యావ్యవస్థను ప్రశ్నించే నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో.. వెంకీ ఫిజిక్స్  ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే..  ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించాల్సిన శ్రియ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంద‌ని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం వెంకీకి జోడీగా శ్రియని ఎంపిక చేసింది చిత్ర బృందం. అయితే.. ఆమె గత నెలలో వివాహం చేసుకున్న నేపథ్యంలో.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఇప్పుడు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడింద‌ట‌ చిత్ర బృందం. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More News

'సాహో'.. ఫ్యాన్స్‌ కోసం సూపర్ ప్రోమో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'.

నాగ్‌, నాని మూవీ సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే

'రంగస్థలం 2' పై స్పందించిన సుకుమార్

ఈ శుక్ర‌వారం విడుదలైన 'రంగస్థలం' అన్ని సెంట‌ర్ల‌లోనూ విజయదుందుభి మోగిస్తోంది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.

ఏప్రిల్‌ 7న భరత్‌ బహిరంగ సభ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

శ్రుతి హాస‌న్ త‌రువాత స‌మంత‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..