క్లారిటి ఇచ్చేసిన‌ శృతిహాస‌న్

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఇటీవ‌ల ప్రారంభం అయిన ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే....ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే...ఇప్ప‌టి వ‌ర‌కు శృతిహాస‌న్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన‌క‌పోవ‌డంతో అస‌లు శృతిహాస‌న్ ఈ చిత్రంలో న‌టిస్తుందా..? లేదా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

ఈ డౌట్స్ కు ఫుల్ స్టాఫ్ పెడుతూ ఈరోజు శృతిహాస‌న్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఈరోజు ట్విట్ట‌ర్ లో శృతిహాస‌న్ ఫ‌స్ట్ డే న్యూఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాను. సో..ఎక్సైటింగ్ అంటూ త‌న సంతోషాన్ని తెలియ‌చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, శృతిహాస‌న్ కాంబినేష‌న్లో రూపొందిన గ‌బ్బ‌ర్ సింగ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. గ‌బ్బ‌ర్ సింగ్ జంట మ‌ళ్లీ న‌టిస్తున్న కాట‌మ‌రాయుడు కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

More News

రానా న్యూమూవీ టైటిల్ ఇదే..!

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత రానా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

'కోటికొక్కడు' ఆడియో విడుదల

సి.ఎల్.ఎన్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్శెట్టి అందిస్తున్న చిత్రం 'కోటికొక్కడు'. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిలుకూరి బాలాజీ

అల్లాణి శ్రీధర్ స్వీయదర్శకత్వంలో ఈటివి సౌజన్యంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిలుకూరి బాలీజీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ కారు సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తి

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్టైగర్'వంటి సూపర్హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నవీన్చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తయింది.

భద్రాద్రి మూవీస్ 'కత్తిలాంటి కుర్రాడు' ప్రారంభం

భద్రాద్రి మూవీస్ బ్యానర్పై విసుశ్రీ, అక్ష, హమీదా హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం కత్తిలాంటి కుర్రాడు విజయదశమి సందర్భంగా హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది.