close
Choose your channels

శృతిహాసన్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేస్తున్న విశాల్‌ 'రాయుడు' టీజర్‌

Monday, May 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(3 మే) ఉదయం 10 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గ్లామర్‌ హీరోయిన్స్‌ శృతి హాసన్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమా అవుతుంది. డైరెక్టర్‌ ముత్తయ్య చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు నేను చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రంలో నా గెటప్‌ వుంటుంది. ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి'' అన్నారు.

'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''ఈ చిత్రం టీజర్‌ను రేపు(3 మే) ఉదయం 10 గంటలకు సోషల్‌ మీడియాలో టాప్‌ హీరోయిన్స్‌ శృతి హాసన్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌ అవుతుందన్న అప్రిషియేషన్‌ వస్తోంది. మే 11న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. మే 20న 'రాయుడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.