నానికి జోడీగా శ్రుతి హాస‌న్‌?

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాస‌న్‌. తెలుగులో దాదాపు అగ్ర హీరోలంద‌రితోనూ సినిమాలు చేసిన శ్రుతి.. గ‌తేడాది విడుద‌లైన కాట‌మ రాయుడు త‌రువాత మ‌రో సినిమా చేయ‌లేదు.

తాజా స‌మాచారం ప్రకారం.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్రాజెక్ట్‌కు శ్రుతి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా మ‌ళ్ళీ రావా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి జెర్సీ పేరుతో ఓ సినిమాని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాలో క‌థానాయిక‌గా శ్రుతి హాస‌న్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే గ‌నుక జ‌రిగితే.. నాని, శ్రుతి కాంబినేష‌న్‌లో వ‌చ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.