శృతి హాసన్‌కి మరో బంపరాఫర్.. చిరు పక్కన ఛాన్స్, స్వయంగా అనౌన్స్ చేసిన మెగాస్టార్

విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన అందం, నటనతో దూసుకెళ్తున్నారు. మధ్యలో కొంచెం స్లో అయినా ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నారు. వరుసపెట్టి మంచి ప్రాజెక్ట్‌ల్లో ఆఫర్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ చెన్నై సుందరికి బంపరాఫర్ తగిలింది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ ఎంపికయ్యారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తన నివాసంలో శృతిహాసన్‌కు పుష్పగుచ్చం అందించిన ఫోటోను చిరు ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడు బాబీ కూడా శృతిహాసన్‌కి వెల్‌కమ్ చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘‘MEGA 154’’ని నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి ఊర మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. 'వాల్తేరు వీరయ్య' టైటిల్ పరిశీలనలో ఉండగా.. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరోవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమాలో కూడా శృతి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'బలుపు', 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి నటిస్తోన్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలు పోషిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

More News

హైదరాబాద్‌‌లోని మహిళా పోలీసులకు ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో.. ఎందుకంటే..?

హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించని సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. వచ్చీ రాగానే  డ్రగ్స్ మాఫియా

రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

జగన్ కీలక నిర్ణయం.. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు, అసెంబ్లీలో ప్రకటన

ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి మరణంపై ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో

ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తా... సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు సినీ ప్రముఖులు.. సీఎం జగన్ సహా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు కూడా.

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్... దళితబంధుకు ప్రాధాన్యత, ఏ రంగానికి ఎంతంటే..?

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు..