బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శృతి హాసన్‌..?

  • IndiaGlitz, [Tuesday,November 23 2021]

బిగ్‌బాస్ రియాలిటీ షోలకు భారతదేశంలో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. హాలీవుడ్ నుంచి దిగుమతైన ఈ షోకు భారతీయులు బ్రహ్మారథం పడుతున్నారు. తొలుత హిందీలో ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బిగ్‌బాస్. స్టార్ హీరోలు హోస్ట్‌లు, ప్రముఖులు కంటెస్టెంట్స్‌గా బుల్లితెరపై కనిపిస్తూ వుండటంతో ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతున్నారు. వారంలో ఐదు రోజులు మినహాయించి.. చివరి రెండు రోజులైన శని, ఆదివారాలు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వరు. ఆ రోజు హోస్ట్‌గా వున్న స్టార్లు వచ్చి.. కంటెస్టెంట్స్‌తో రకరకాల గేమ్స్ ఆడిస్తూ వినోదం పంచుతూ వుంటారు.

అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు బిగ్‌బాస్‌ హోస్ట్స్‌ అందుబాటులో లేకపోతే.. వారి స్థానంలో మరొక సెలబ్రెటీ షో హోస్ట్‌గా వ్యవహరించిన దాఖలాలు ఎన్నో వున్నాయి. గతేడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో హోస్ట్‌‌గా వున్న నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీకెండ్‌ ఎపిసోడ్స్‌ టీఆర్‌పీ ఆకాశాన్ని తాకింది. తాజాగా ప్రస్తుత తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ షోకు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. అయితే అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన కమల్‌‌కు కోవిడ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

దీంతో ఆయన మరో రెండు వారాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టం. దీంతో కమల్‌ స్థానంలో హీరోయిన్‌, ఆయన కుమార్తె శృతి హాసన్‌ను హోస్ట్‌గా దింపేందుకు తమిళ బిగ్‌బాస్‌ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. దీని వల్ల ఈ షో మరింత ఆసక్తిగా మారుతుందని వారి ప్లాన్. మరి వారి ప్రపోజల్‌కు శృతీహాసన్ ఓకే చెప్పిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్‌ వరకు వేచి చూడాలి.

More News

అచ్చం సమంత దారిలోనే ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టా ఖాతాలో భర్త పేరు తొలగింపు, దాని అర్థమేంటీ..?

బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌‌గా వెలుగొందుతున్నారు ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌.

బంగార్రాజు : స్టైలీష్ లుక్‌లో ఊతకర్ర గీరాటేస్తూ.. కుమ్ముతున్నట్టు లేదూ చైతూ ఫస్ట్ లుక్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.

కరోనా బారినపడ్డ కమల్ హాసన్.. మహమ్మారి మన మధ్యలోనే వుందంటూ ట్వీట్

కోలీవుడ్ దిగ్గజ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిమిత్తం ఉద్దేశించిన మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలుగులో విడుదల కానున్న మోహన్‌లాల్ ‘‘మరక్కార్’’

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్‌’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడిన సంగతి తెలిసిందే.