close
Choose your channels

అది హిట్ అయితే... శ్రుతి గ్లోబ‌ల్ స్టారే

Wednesday, June 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అది హిట్ అయితే... శ్రుతి గ్లోబ‌ల్ స్టారే

ఏ ప్రాజెక్ట్ ఎవ‌రిని ఏ అంద‌లాలు ఎక్కిస్తుందో తెలియ‌దు. కొన్నిసార్లు అదృష్టం హ‌ఠాత్తుగా త‌లుపు త‌డుతుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ త‌న‌య శ్రుతిహాస‌న్ ప‌రిస్థితి అచ్చం అలాగే ఉంది. ఆమె ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ కి సంత‌కం చేశార‌ట‌. ఆ ప్రాజెక్ట్ ను యుఎస్ ఎ నెట్‌వ‌ర్క్ సీరీస్ తెర‌కెక్కించ‌నుంద‌ట‌. ఆ సీరీస్ పేరు ట్రెడ్ స్టోన్‌. జేస‌న్ బోర్న్ యూనివ‌ర్స్ కి సంబంధించిన క‌థ‌తో ఇది రూపొంద‌నుంది.

ఇందులో శ్రుతిహాస‌న్ వెయిట్రెస్‌గా క‌నిపిస్తారు. కానీ ఆమె అండ‌ర్‌క‌వ‌ర్‌లో ప‌నిచేస్తుంటారు. పైల‌ట్ ఎపిసోడ్‌ను రామిన్ బ‌హ్రానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. యు.ఎస్‌.లోనూ, ఇండియాలోనూ షూటింగ్ జ‌రగనుంది. శ్రుతి కెరీర్లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఈ సీరీస్ స‌క్సెస్ అయితే క‌నుక‌, ప్రియాంక చోప్రాకు వ‌చ్చినంత పేరు శ్రుతిహాస‌న్‌కు కూడా వ‌స్తుంది. మ‌రోవైపు ర‌వితేజ సినిమా కోసం కూడా శ్రుతిని సంప్ర‌దించిన విష‌యం తెలిసిందే. శ్రుతి ఇప్పుడు రెండింటికీ కాల్షీట్ అడ్జ‌స్ట్ చేస్తుందా?. లేకుంటే ర‌వితేజ‌కు నో చెబుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.