'సిద్ధార్ధ' చిత్రీకరణ పూర్తి

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

'జీనియస్', 'రామ్ లీల' చిత్రాల ద్వారా రామదూత క్రియేషన్స్ కి ఓ బేనర్ వేల్యూ తెచ్చుకోగలిగారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్. మేకింగ్ విషయంలో రాజీపడకుండా కథకు తగ్గ బడ్జెట్ తో నిర్మించి రాజీపడని నిర్మాత అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సిద్ధార్థ‌'. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర దిశ‌గా అడుగులు వేస్తున్న ఆర్‌.కె.నాయుడు హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణీ నంద్వాని నాయిక‌లు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - ''మలేసియా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. విసు మంచి కథ ఇచ్చారు. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. సిద్ధార్ధగా ఆర్.కె. నాయుడు పవర్ ఫుల్ రోల్ చేశారు. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. ఇందులో ఉన్న నాలుగు పాటలకు మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఎస్‌.గోపాల్‌రెడ్డి గారి లాంటి టాప్‌మోస్ట్ టెక్నీషియ‌న్ మా సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది'' అని అన్నారు.

More News

మ‌హేష్..చెప్పులు తొడుగుతుంది అత‌నికే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ రిలీజ్ చేసారు.

స‌రైనోడు సెన్సార్ టాక్..

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

సర్దార్ సరికొత్త ట్రెండ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులకు తెర తీస్తుంది.

జగన్ పార్టీలో మోహన్ బాబు..?

విలక్షణ నటుడు మోహన్ బాబు...మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రెస్ మీట్ పెట్టి మరీ...నేను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించేసారు.

అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్....

అఖిల్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన హీరో అక్కినేని అఖిల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాడు.