శ్రీరెడ్డి హీరోయిన్‌గా సిల్క్‌స్మిత బయోగ్రఫీ

  • IndiaGlitz, [Saturday,February 13 2021]

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో పెద్దగా నటి శ్రీరెడ్డి గురించి వినిపించడం లేదు. ఆ మధ్య కాలంలో బాగా హడావుడి చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత మకాంను కోలీవుడ్‌కి మార్చింది. అయితే అక్కడ కూడా ఆమెకు అవకాశాలైతే వచ్చినట్టుగా ఏమీ లేవు. తాజాగా శ్రీరెడ్డి తన సినిమాను ప్రకటిస్తూ మరోసారి వార్తలకెక్కింది. దివంగత నటి సిల్క్‌స్మిత బయోగ్రఫీలో తాను టైటిల్ రోల్ పోషించనున్నట్టు శ్రీరెడ్డి తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి అనేక అడ్వర్‌టైమెంట్‌లకు దర్శకత్వం వహించిన మధు దర్శకత్వం వహించనున్నట్టు ఆమె తెలిపింది.

ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె తెలిపింది. సినిమాల కంటే ఎక్కువగా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె జరిపిన పోరాటం ద్వారానే శ్రీరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. తెరవెనుక జరిగే అనేక సంచలన విషయాలను వెల్లడిస్తూ కొంతకాలం పాటు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యంగా పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించి వారు తనను మోసం చేశారని చెప్పి పెను సంచలనానికి తెరదీసింది. అయితే ఇప్పటికీ శ్రీరెడ్డి అడపా దడపా సోషల్‌ మీడియా వేదికగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూనే ఉంది.