సింగం 3 ముహుర్తం ఫిక్స్ చేసిన సూర్య‌..

  • IndiaGlitz, [Thursday,December 31 2015]

త‌మిళ హీరో సూర్య న‌టించిన సింగం ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తెలుగులో సింగం యుముడు టైటిల్ తో రిలీజ్ అయి సూప‌ర్ హిట్ అయ్యింది. ఆత‌ర్వాత సింగం సీక్వెల్ గా వ‌చ్చిన సింగం 2 కూడా తెలుగు, త‌మిళ్ లో విజ‌యం సాధించింది. ఇప్పుడు సూర్య‌ సింగం 3 చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌సంగ‌, 24 మూవీస్ లో బిజీగా ఉన్న సూర్య సింగం 3 కి ముహుర్తం ఫిక్స్ చేసారు.

జ‌న‌వ‌రి 7 నుంచి వైజాగ్ లో 30 రోజులు పాటు సింగం 3 షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. వైజాగ్ షెడ్యూల్ త‌ర్వాత‌ తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. సింగం 1, 2 లో న‌టించే అనుష్క సింగం 3 లో కూడా న‌టిస్తుంది. ఈ సినిమాలో అనుష్క తో పాటు శ్రుతి హాస‌న్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం. సింగం 1, 2 ల‌కు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తే...సింగం 3 కి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి..సింగం 1,2 ల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సూర్య సింగం 3 తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

నితిన్, త్రివిక్ర‌మ్ ల స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ..

యంగ్ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద విహారి అనేది సినిమా ట్యాగ్ లైన్.

అదే జోడిని రిపీట్ చేస్తున్న డైరెక్టర్...

ఈ ఏడాది రెండో ప్రపంచ యుద్ధానికి,ధూపాటి హరిబాబు ప్రేమకథకు లింక్ పెట్టి దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమ్'కంచె'.

'డిక్టేటర్ ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్ డేట్...

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శతక్వంలో రూపొందిన చిత్రం 'డిక్టేటర్'.అంజలి,సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.

స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న సరైనోడు...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

వర్మకు కార్పొరేట్ అవకాశం...

రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ విడుదల తర్వాత బాలీవుడ్ వెళుతున్నానని మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.కిల్లింగ్ వీరప్పన్ జనవరి 1న విడుదల అవుతుంది.