తలకోనలో సింగం

  • IndiaGlitz, [Wednesday,September 28 2016]

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ 'ఎస్‌-3'(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. సింగం సీక్వెల్ సక్సెస్ లతో ఇప్పుడు రానున్న మూడో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చిత్రీకరణ పూర్తి కాకమునుపే తమిళంలో థియేట్రిక‌ల్ హ‌క్కులు దాదాపు 41 కోట్ల రూపాయలు చెల్లించి హ‌క్కులు సొంతం చేసుకున్నార‌ని టాక్‌.

అలాగే తెలుగులో కూడా నైజాం, ఆంధ్ర‌లకు సంబంధించి 18 కోట్ల రూపాయ‌ల‌ ఫ్యానీ రేటు చెల్లించే నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడ‌ని స‌మాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ను తలకోనలో హీరో సూర్య, విలన్ అనూప్ లపై చిత్రీకరిస్తున్నారట. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

More News

'ధోని' పాక్ లో ఆడటం లేదు

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎన్ ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్స్పై సుశాంత్ సింగ్ రాజపుత్, కైరా అద్వాని, దిశాపటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఎం.ఎస్.ధోని' ..ది అన్టోల్డ్ స్టోరీ ట్యాగ్లైన్.

'హైపర్' శాటిలైట్ హక్కులు

ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

అల్ల‌రోడు తండ్ర‌య్యాడు

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత తెలుగులో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న హీరో అల్ల‌రిన‌రేష్ హీరోగా వ‌రుస సినిమాల‌తో త్వ‌ర‌గా హాప్ సెంచరీల‌ను పూర్తి చేసేశాడు. హీరోగా బిజీగా ఉన్న అల్ల‌రి న‌రేష్ తండ్రి కూడా అయ్యాడు.

'ప్రేమమ్' పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య శృతిహాసన్ ,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.

'ఈడు గోల్డ్ ఎహే' సెన్సార్ పూర్తి

డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది.