కోవిడ్ బారినపడ్డ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. ఐసీయూలో చికిత్స

  • IndiaGlitz, [Tuesday,January 11 2022]

దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వరుస పెట్టి ఒక్కొక్క సినీ ప్రముఖుడు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, మహేశ్ బాబు, కరీనా కపూర్, త్రిష, అరుణ్ విజయ్, వడివేలు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తమన్ , రాజేంద్ర ప్రసాద్ , బండ్ల గణేశ్ వంటి వారు కోవిడ్ బారినపడ్డారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దిగ్గజ గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ చేరారు. కోవిడ్ లక్షణాలతో ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం లతాజీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆమె మేనకోడలు రచన తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ వృద్ధాప్య సమస్యల కారణంగా లతా మంగేష్కర్‌ను ఐసీయూకి తరలించినట్లు రచన వెల్లడించారు. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కోవిడ్ సోకింది. దీంతో వారు క్వారంటైన్‌లో వుంటున్నారు.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో 1,68,063 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో 33 వేలు, ఢిల్లీ, బెంగాల్‌లలో 19 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కేసులు అధికంగా వున్నాయి. అలాగే దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు వున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,247 మంది ఒమిక్రాన్ బారినపడగా.. రాజస్థాన్ 654, ఢిల్లీలో 546 కేసులు నమోదయ్యాయి.

More News

మంత్రి హరీశ్‌రావును కలిసిన బాలకృష్ణ.. క్యాన్సర్ హాస్పిటల్‌కు సాయంపై వినతి

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుని కలిశారు.

అదిరిపోయిన మహేష్ మేనల్లుడి 'హీరో' ట్రైలర్ .. అశోక్ గల్లా లుక్స్ అదుర్స్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి.

రాజ'శేఖర్'లో శివానీ రాజశేఖర్...‌

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

టికెట్ ధరల వివాదం... ముగిసిన ఆర్జీవీ - పేర్ని నాని భేటీ , చివరికి ఏం తేల్చారంటే..?

ఏపీ  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు.

సీనియర్ నటి శోభనకు కరోనా పాజిటివ్... ‘‘ఒమిక్రాన్’’గా నిర్ధారణ

దేశంలో సినీనటులు కోవిడ్ బారినపడుతూనే వున్నారు. ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండే సినీతారలను మహమ్మారి వదలడం లేదు.