నాకు, నా కుటుంబానికి ప్రాణహానీ వుంది.. పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Monday,April 24 2023]

తనకు, తన కుటుంబానికి ఓ వ్యక్తి నుంచి ప్రాణహానీ వుందంటూ ప్రముఖ నేపథ్య గాయనీ సునీత భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో నివసిస్తున్న రామ్ వీరపనేని సెల్‌కు గతేడాది ఓ సందేశం వచ్చింది. అటు వైపు వ్యక్తి తన పేరు కే.కే.లక్ష్మణ్ అని.. తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో సభ్యుడినని చెప్పాడు. తాను వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నానని కోరగా.. అందుకు రామ్ వీరపనేని అంగీకరించలేదు. అయితే ప్రతి నిత్యం మెసేజ్‌లతో వేధిస్తూ వుండటంతో ఆయన ఆ నెంబర్‌ను బ్లాక్ చేశారు. అయితే ఈ ఏడాది మార్చి 28న మరో కొత్త నెంబర్ నుంచి అదే పనిగా మెసేజ్‌లు వస్తూ వుండటంతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో రామ్ వీరపనేని శనివారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న రామ్-సునీత :

కాగా.. సింగర్ సునీతను రామ్ వీరపనేని గతేడాది పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. 2021 జనవరి 9న వీరిద్దరి పెళ్లి హైదరాబాద్‌లో సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. నాటి నుంచి ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సునీత తన సినిమాలు, పాటలతో బిజీగా వుండగా.. రామ్ తన వ్యాపారాలను చూసుకుంటున్నారు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సునీత కొడుకు :

ఇకపోతే.. సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కుమార్తె శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన ఆమె.. కుమారుడి జీవితాన్ని కూడా సెట్ చేసే పనిలో పడ్డారు. ఆకాశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుమారుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు సునీత. ‘‘సర్కారు నౌకరి’’ పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్ కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు.

More News

Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్లారంటే..?

లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో వుంటున్న

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు : చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్... ఒకే వేదికపై తలైవా, చంద్రబాబు, బాలయ్య

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

శరత్‌బాబుకు అస్వస్థత.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు, లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌గా వుండటంతో బెంగళూరు

Samantha :సిటాడెల్ ప్రీమియర్ షోలో మెరిసిన సమంత.. ఆమె ధరించిన స్నేక్ నెక్లెస్, బ్రాస్లెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వున్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు.

Ramcharan and Upasana:ఆస్కార్ వీడియోతో స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. కోట్లాది మంది అభిమానులున్న అగ్ర క‌థానాయ‌కుడు. రీసెంట్‌గా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఆస్కార్ అవార్డ్స్ సంద‌ర్భంగా