సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,June 18 2018]

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న ప్రేమదేశం చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. పూరి జగన్నాధ్ అబ్బాయి ఆకాష్ పూరి చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

అజయ్, మాయ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టడం జరిగింది. ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించగా జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీకాంత్ శిద్ధం ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. నీలిమ తిరుమల్ శెట్టి సహకారంతో శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఈ నెల 29న 'శంభో శంక‌ర‌' గ్రాండ్ రిలీజ్‌

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్.

మూడు విభిన్నమైన పాత్ర‌ల్లో..

తమిళ క‌థానాయ‌కుడు శ‌ర‌త్ కుమార్‌కు తెలుగులోనూ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభమైన అల్లు శిరీష్ 'ఏబీసీడీ తెలుగు' చిత్రం

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం లో జరిగింది.

సుధీర్ సెంటిమెంట్ క‌లిసొచ్చింది

'ఏమాయ చేసావె' చిత్రంలో స‌మంత అన్న పాత్ర‌లో మెరిసిన సుధీర్ బాబు.. 2012లో విడుద‌లైన 'ఎస్‌.ఎం.ఎస్' చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశారు.

'శ్రియ శరణ్' 'నీహారిక కొణిదెల' చిత్రానికి 'వరుణ్ తేజ్' క్లాప్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ "కంచె"  "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" నందమూరి  బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు.