ఈ దర్శకులు సినిమా తీస్తే.. ఆయన పాట వుండాల్సిందే, ఇది ‘‘ సిరివెన్నెల ’’ ప్రస్థానం..!!

  • IndiaGlitz, [Tuesday,November 30 2021]

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. తన పాటతో తెలుగు చిత్ర సీమకు ఎంతో ఖ్యాతిని సంపాదించి పెట్టారు సిరివెన్నెల. ఆయన పూర్తి పేరు చెంబోలు సీతారామశాస్త్రి . 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సిరివెన్నెల జన్మించారు. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివిన ఆయన... కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమండ్రిలో కొన్నాళ్లు పనిచేశారు. అయితే అన్నలో వున్న ప్రతిభను గుర్తించిన సిరివెన్నెల తమ్ముడు.. బాగా ప్రోత్సహించారట.

ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలి పాటను రాశారు. విధాత తలపున’ పాటతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు తన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రి ది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు .. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు. దర్శకుడు కె.విశ్వనాధ్‌తో సిరివెన్నెల నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ పాట రాశారు సీతారామశాస్త్రి. ఆయనపై అభిమానంతో కె.విశ్వనాథ్ ప్రేమగా సీతారాముడు అని పిలిచేవారట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు స్వయంగా బంధువు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రే. ఇక నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగరాయ్‌లో చివరిగా రెండు పాట‌లు రాశారు సిరివెన్నెల. ఈ క్రమంలోనే ఆయన న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని టార్గెట్ చేసిన ఆ నలుగురు.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు చివరి దశకు చేరుకోవడంతో షో ఉత్కంఠగా మారుతోంది. ఇక కొద్దివారాలే మిగిలి వుండటంతో ఎవరు ఉంటున్నారు..?

కెరీర్‌లో తొలిసారిగా.. నవ్విస్తానంటున్న అందాల రాక్షసి

"అందాల రాక్షసి" సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠీ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది.

ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. హెల్త్ బులిటెన్ విడుదల

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్ధితిపై సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రి వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.

కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ప్రారంభం

రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది.

ఓయూ: చెట్ల మధ్యలో 'సమాధి' కలకలం.. పరుగులు తీసిన విద్యార్ధులు

చదువుల తల్లి సరస్వతి దేవి నడయాడే విద్యా నిలయం.. ఎందరో విద్యార్ధులను దేశానికి అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సమాధి కలకలం రేపింది.