Download App

Sita Review

ఈ ప్ర‌పంచంలోని కుట్ర‌లు, క‌ల్మ‌షం వంటివేవీ తెలియ‌కుండా నింపాదిగా ఉన్న వ్య‌క్తిత్వంతో పెరుగుతాడు హీరో. మ‌నీ మేకింగ్ మీద కాన్‌సెన్‌ట్రేష‌న్‌తో ఉంటుంది హీరోయిన్‌. ఆమె పేరు సీత‌. అత‌ను పేరు ర‌ఘురామ్‌. వీరిద్ద‌రి మ‌ధ్య ఓ విల‌న్‌. విన‌డానికి రెగ్యుల‌ర్ తెలుగు సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ అయిన‌ప్ప‌టికీ, త‌న కేర‌క్ట‌ర్‌లో బోలెడ‌న్ని వేరియేష‌న్స్ ఉన్నాయ‌ని ఈ మ‌ధ్య‌నే ఇంట‌ర్వ్యూలో చెప్పారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. సినిమా ఎలా వ‌చ్చిందో తాను చెప్ప‌డం క‌న్నా, ఆడియ‌న్స్ చూసి చెప్తే బావుంటుంద‌ని ప్రీ రిలీజ్‌లో తేజ అభిప్రాయ‌ప‌డ్డారు.  ఇంటెన్స్ ఉన్న పాత్ర చేశాన‌ని కాజ‌ల్ చెప్పారు. ఆడియ‌న్స్ కు రిలీఫ్ కోసం బుల్‌రెడ్డి పాట వ‌స్తుంద‌ని యూనిట్ అంతా అన్నారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కుడికి ఇవ‌న్నీ క‌నెక్ట్ అయ్యాయా... చ‌దివేయండి

క‌థ‌:

ర‌ఘురామ్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)ను అత‌ని మేన‌త్త చిత్ర హింస‌లు పెడుతుంది. దాంతో అత‌ను మాన‌సికంగా క్రుంగిపోతాడు. మేన‌మామ‌.. అత‌న్ని భూటాన్‌లోని ఓ బౌద్ధాల‌యంలో చేర్పిస్తాడు. బౌద్ధుల స‌మ‌క్షంలో ర‌ఘురామ్, నేటి ప్ర‌పంచంలోని చెడుకు వ్య‌తిరేకంగా మంచి వ్య‌క్తిగా పెరుగుతాడు. ర‌ఘురామ్‌కి మేన‌మామ కూతురు సీత‌(కాజ‌ల్ అగ‌ర్వాల్‌) అంటే ఇష్టం. దాంతో.. ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. హోట‌ల్ బిజినెస్‌లోకి రావాల‌నుకున్న సీత‌, ఓస్థ‌లాన్ని కొంటుంది. అక్క‌డి పేద‌వారిని త‌రిమేయాల‌ని ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూసూద్)ని హెల్ప్ అడుగుతుంది. త‌న‌తో నెల‌రోజులు లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉంటేనే స‌హాయం చేస్తాన‌ని బ‌స‌వ‌రాజు కండీష‌న్ పెడ‌తాడు. స‌రే! అని అగ్రిమెంట్‌పై సంత‌కం పెడుతుతుంది సీత‌. ప‌ని పూర్త‌యిన త‌ర్వాత బ‌స‌వ‌రాజుకి బురిడీ కొట్టాల‌ని చూస్తుంది. త‌న పొలిటిక‌ల్ ప‌వ‌ర్‌తో బ‌స‌వ‌రాజు ఆమెను లొంగ‌దీసుకోవాల‌నుకుంటాడు. చెక్ బౌన్స్ కేసు పెట్టిస్తాడు. ఇక డ‌బ్బులు అవ‌స‌రమైన త‌రుణంలో తండ్రి చ‌నిపోతాడు. తండ్రి త‌న ఆస్థినంతా ర‌ఘురామ్ పేరున రాసేశాడ‌ని తెలుసుకుంటుంది సీత‌. అత‌న్ని సిటీలోకి తీసుకొచ్చి ఆస్థి పేప‌ర్స్ మీద సంత‌కం పెట్టి డ‌బ్బులన్నీ తీసుకుని త‌రిమేయాల‌నుకుంటుంది. అప్పుడేమ‌వుతుంది?  బ‌స‌వ‌రాజు ఏం చేస్తాడు?  సీత‌కు ఎలాంటి క‌ష్టాలు వ‌స్తాయి?  ర‌ఘురామ్ ఆమెను కాపాడుకుంటాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

స‌మీక్ష‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ముందుగా కాజ‌ల్ గురించి చెప్పాలి. డ‌బ్బుల కోసం అందితే జుట్టు , అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకోవాల‌నుకునే ర‌కమైన నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. సినిమా ప‌ది నిమిషాల ముందు వ‌ర‌కు ఆమె పాత్ర నెగిటివ్ ట‌చ్‌తోనే సాగుతుంది. పాత్ర‌లో కాజ‌ల్ చక్క‌గా న‌టించింది. ఇక విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డం, హీరోయిన్స్‌తో పాటలు పాడుతూ వ‌చ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ .. వైవిధ్య‌మైన పాత్ర‌లో.. సాధార‌ణ‌మైన, అమాయ‌కుడైన యువ‌కుడిగా చ‌క్క‌గా న‌టించాడు. ఇక సినిమాలోమెయిన్ విల‌న్‌గా న‌టించిన సోనూసూద్ త‌న న‌ట‌న‌తో పాత్ర రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లిపోయాడు. త‌న పాత్ర‌లో విల‌నిజం, కామెడీ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. సోనూ సూద్ పాత్ర‌ను సునాయ‌సంగా చేశాడ‌నిపించింది. ఇక కె.భాగ్య‌రాజ్‌, అభిన‌వ్‌, మ‌న్నారా, మ‌హేష్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ద‌ర్శ‌కుడు తేజ రామాయ‌ణంలో పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని క‌థ‌ను రాసుకున్నాడు. అది కూడా హీరోయిన్ యాంగిల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క‌థానాయ‌కి కోణంలో సినిమా సాగ‌డం బావుంది. ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్‌టైనింగ్ ఉంది. ముఖ్యంగా త‌నికెళ్ల‌భ‌ర‌ణి, సోనూసూద్ పాత్రల మ‌ధ్య స‌న్నివేశాలు ఎంట‌ర్‌టైనింగ్ ఉంటాయి. ఇక సెకండాఫ్ అంతా ఒక‌చోట‌నే తిరుగుతున్న‌ట్లు అనిపిస్తుంది. దాంతో ప్రేక్ష‌కుడికి సినిమా ఇంకా అయిపోలేద‌నే భావ‌న వ‌స్తుంది. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండుంటే బావుండేది. అనూప్‌రూబెన్స్ పాట‌లు, బ్రాగ్రౌండ్ స్కోర్ బాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

బోటమ్‌: సీత‌..కాస్త కామెడి.. సాగదీత ఎక్కువ‌

Read Sita Movie Review in English

Rating : 2.3 / 5.0