close
Choose your channels

చార్లీచాప్లిన్‌గా మారిన శివాజీ

Wednesday, June 19, 2019 • తెలుగు Comments

చార్లీచాప్లిన్‌గా మారిన శివాజీ

ఇదేంటి.. గరుడుపురాణం శివాజీ.. చార్లీచాప్లిన్‌లా మారడమేంటి..? తూచ్.. ఆయనకు ఏం అవసరం..? ఆయన చాలా రోజులుగా పరారీలో ఉన్నారుగా..? అని ఆలోచిస్తున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. శివాజీని.. చాప్లిన్‌గా కొందరు ఫొటో షాప్‌లో మార్చేశారండోయ్.. ఇంతకీ అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.

వేషం మార్చెనా..!

టీవీ9 వివాదంలో చిక్కుకున్న గరుడ పురాణం శివాజీ అడ్రస్ గల్లంతయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంలో పలుమార్లు నోటీసులివ్వడమే కాకుండా.. లుక్ అవుట్ నోటీసులు సైతం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఎక్కడున్నాడో ఇంత వరకూ తెలియరాలేదు.. పోలీసులు కూడా కనిపెట్టలేకపోతున్నారు!. అయితే కొందరు మాత్రం దేశం దాటేశారని.. వేషాలు మార్చి తిరుగుతున్నాడని మరికొందరు ఇలా గుసగుసలాడుతున్నారు. ఈ తరుణంలో శివాజీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.

సెటైర్లే సెటైర్లు..!

ఇదిగో ఈ ఫొటోలను కాసింత నిశితంగా గమనిస్తే మీకే అసలు విషయమేంటో తెలుస్తుంది. ఫొటో చూడగానే టక్కున చార్లీచాప్లిన్ గుర్తొచ్చారు కదూ. ఈ ఫొటో చూసిన నెటిజన్లు, కొందరు విమర్శకులు వామ్మో శివాజీ ఏంటి.. కొత్త అవతారంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు..? ఇంతకీ ఏమైంది ఈయనకు..? పైగా ప్రస్తుతం సినిమాల్లో నటించట్లేదుగా మరి ఈ గెటప్ ఎందుకు..? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరైతే అజ్ఞాతంలో ఉన్నాడుగా.. ఎవరికీ చిక్కకూడదని.. ఇలా అవతారాలు మారుస్తున్నాడేమో అని సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు.

ఏం పురాణం చెబుతారో!

అంతేకాదు.. సారూ ఇలా అజ్జాతంలో ఉండిపోవడమేనా? బయటకు వచ్చేదేమైనా ఉందా..? మీ మిత్రుడు రవి ప్రకాష్‌ వచ్చారు..? పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారుగా మీరు కూడా ఇకరండి ఇప్పటికే ఆలస్యమైందిగా..? అంటూ విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఫొటో ఫొటో షాప్‌లోనే మార్ఫింగ్ చేసి హంగామా చేస్తున్నారా..? లేకుంటే ఎవరూ గుర్తుపట్టకూడదని శివాజీనీ ఇలా గెటప్ వేశారా అన్నది తెలియాలంటే.. మరీ ముఖ్యంగా ఇలా ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడో తెలియాలంటే.. ఆయన మీడియా ముందుకొచ్చి కొత్త పురాణం చెప్పేవరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz