'సైజ్ జీరో' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,November 27 2015]

ఇప్పుడు యూత్ అంద‌రూ ఎక్స‌ర్‌సైజ్‌లు చేసి బాడీలు పెంచుతుంటారు. కానీ ఈ ఫిట్‌నెస్‌ల‌పై ఆధార‌ప‌డి కొన్ని సెంట‌ర్స్‌వారు కొద్దిరోజుల్లోనే స‌న్న‌బ‌డిపోతారు అంటుంటారు. అలాగే మ‌న‌కు క‌న‌ప‌డే అమ్మాయిల్లో లావుగా ఉండి పెళ్ళి కానీ అమ్మాయిలుంటారు. ఈ రెండు నేప‌థ్యాల‌ను మూడిపెట్టి తీసిన చిత్ర‌మే సైజ్ జీరో'. అయితే ఫిజిక‌ల్ హెల్త్ కంటే మెంట్ హెల్త్ ముఖ్య‌మ‌ని చెప్పేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మని కూడా చెప్పవచ్చు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏ మేర ప‌లిస్తుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్ళాల్సిందే...

క‌థ‌

సౌంద‌ర్య అలియాస్ స్వీటీ (అనుష్క‌) చిన్న‌ప్ప‌టి నుండి తిండి ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల లావు అయిపోతుంది. త‌ల్లి ఊర్వ‌శి ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసిన స్వీటీ లావుగా ఉంద‌నే కార‌ణంతో త‌న‌ని ఎవ‌రూ పెళ్ళి చేసుకోరు. అలా పెళ్ళి చూపులు చూడ‌టానికి వ‌చ్చిన వాళ్ళ‌లో అభి(ఆర్య‌) ఒక‌డు. త‌ను క్లీన్ ఇండియాపై డాక్య‌మెంట‌రీ తీయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. అత‌ని యూర‌ప్ నుండి వ‌చ్చిన ఎన్‌.జి.ఒ సిమ్రాన్(సోనాల్ చౌహాన్‌) కూడా తోడ‌వ‌తుంది. అభిను స్వీటీ ఇష్ట‌ప‌డుతుంది. కానీ అభి, సిమ్రాన్ ను ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని తెలిసి బాధ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గించుకోవాల‌నే ఉద్దేశంతో సైజ్‌జీరో అనే ఫిట్ నెస్ సెంట‌ర్‌లో చేరుతుంది. అక్క‌డ నుండి క‌థ అనుకోని మ‌లుపు తిరుగుతుంది. ఆ మ‌లుపేంటి? స‌్వీటీ బ‌రువు త‌గ్గుతుందా? అభి చివ‌ర‌కు ఎవ‌రిని పెళ్ళి చేసుకుంటాడు? ఇలాంటి విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌

ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అనుష్క‌. బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి చిత్రాలు త‌ర్వాత అనుష్క చేసిన చిత్రం కూడా కావ‌డం ఈ సినిమాకు క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ తెచ్చిపెట్టేదే. టైటిల్‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో అనుష్క ఈ సినిమాకోసం దాదాపు 20 కిలోల బ‌రువు కూడా పెర‌డం సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఓవరాల్‌గా అనుష్క సినిమా కోసం చేయాల్సిదంతా చేసింది. ఆర్య త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. లుక్స్ ప‌రంగా చాలా హ్యండ్‌స‌మ్‌గా క‌నిపించాడు. సోనాల్ చౌహాన్ పాత్ర గ్లామ‌ర్ డాల్ అనే చెప్పాలి. పెళ్ళి కానీ కూతురు కోసం క‌ష్ట‌ప‌డే తల్లిపాత్ర‌లో ఊర్వ‌శి, సైజ్ జీరో ఫిట్‌నెస్ సెంట‌ర్ య‌జమాని స‌త్యానంద్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్, పివిపి స్పోర్ట్స్ ప్ర‌తినిధి పాత్ర‌లో అడ‌విశేష్‌లు చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాలో నాగార్జున‌, మంచు ల‌క్ష్మి, రానా, జీవా, త‌మ‌న్నా, హ‌న్సిక‌, శ్రీదివ్య‌లు తళుక్కున మెరిశారు. కీర‌వాణి సంగీతం, బ్యాక్ గ్రాండ్ స్కోర్ బావుంది. నిరవ్ షా సినిమాటోగ్ర‌ఫీ క‌లర్‌ఫుల్‌గా అనిపించింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌

సినిమా నిడివి రెండు గంట‌ల ప‌దినిమిషాలే అయినా సినిమా లాగ్ అయిన‌ట్లుగా ఉంది. అలాగే సినిమా క్ల‌యిమాక్స్‌ను ఇంకా త్వ‌ర‌గానే ముగించి ఉండుంటే బావుండేది. క్లైమాక్స్ సాగ‌దీసిన‌ట్టుగా ఉంది. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ఆక‌ట్టుకోలేదు. ఫ‌స్టాఫ్ కానీ, సెకండాఫ్ కానీ సినిమాను లాగిన‌ట్టుగా ఎడిటింగ్ క‌న‌ప‌డుతుంది.

విశ్లేష‌ణ‌

ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి, క‌ణిక‌ల క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గానే నిర్వ‌ర్తించారు. సినిమా ద్వారా వెయిట్ త‌గ్గ‌డానికి ఉప‌యోగించే ప‌ద్ధ‌తులు అనే కాన్సెప్ట్‌ను చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశారు. కీర‌వాణి సంగీతంలో వ‌చ్చే టైటిల్ సాంగ్, మెల్ల మెల్ల్గా.. అంటూ సాగే పాట ఆక‌ట్టుకున్నాయి. మిగిలిన పాట‌లు బానే ఉన్నా పాడుకునేంత‌గా అనిపిచవు. కీర‌వాణి కూడా సినిమా సాంగ్‌లో న‌టించ‌డం ప్రేక్ష‌కులు చిన్న స్వీట్ షాకింగ్‌, పెద్ద స్టార్స్‌ను గెస్ట్ రోల్స్‌లో క‌నిపించేలా చేశారు. అంద‌రూ ఓ మంచి ప్ర‌య‌త్నం కోసం పాటుప‌డేవిధంగా చూప‌డం కూడా మంచి పాయింటే అయితే ఈ పాత్ర‌ల నిడివిని మ‌రి కాస్తా పెంచుంటే బావుండేది. నేను కూతురుగా నీ బాధ్య‌త అనుకున్నాను, కానీ క‌ష్టాన‌ని ఈవాళే తెలిసింది'. నా త‌ల్లి ఇచ్చిన దైర్యాన్ని, స‌పోర్ట్‌ను తల్లిగానే నేను నీకు ఇవ్వ‌లేక‌పోయాను' అని ఊర్వ‌శి అనుష్క‌తో సంద‌ర్భానుసారం చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఫిట్‌నెస్ సెంట‌ర్స్ గురించి సినిమాను పూర్తిగా తీసుంటే క‌ష్ట‌మ‌య్యేది కానీ దానికి ఎమోష‌న‌ల్ కంటెంట్ జోడించ‌డం ప్ల‌స్ అయింది.

బాట‌మ్ లైన్‌

మొత్తంమీద సైజ్ జీరో ..ఆకట్టుకునే బొద్దు ప్ర‌య‌త్నం

రేటింగ్: 3/5

English Version Review

More News

నిత్యా మీనన్ హీరోయిన్ కాదట

పాత్ర నచ్చితే చాలు..నిడివితో సంబంధం లేకుండా సినిమా చేసేస్తుంటుంది నిత్యా మీనన్.నిన్నటికి నిన్న 'సన్నాఫ్ సత్య మూర్తి''లో హీరోయిన్ కి తక్కువ..

అల్లు అర్జున్ బాటలో అనుష్క?

ఈ సంవత్సరం అనుష్క కెరీర్ లో ప్రత్యేకమని చెప్పాలి.ఎందుకంటే..ఈ సంవత్సరం అనుష్క నటించిన తెలుగు సినిమాలన్నీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే.'బాహుబలి','రుద్రమదేవి'లతో ఇప్పటికే తన గురించి మాట్లాడేలా చేసిన అనుష్క..

విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు

'శివపుత్రుడు','అపరిచితుడు'వంటి తమిళ అనువాదాలతో తెలుగులోనూ మార్కెట్ ని పొందాడు విక్రమ్.పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ..

పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".

తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మ‌స్తానీ'

ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావ్ మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.