close
Choose your channels

'సైజ్ జీరో' వాయిదా పడనుందా...?

Sunday, August 30, 2015 • తెలుగు Comments

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో`. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . బాహుబలి` వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో`తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, ఆడియో విడుద‌ల‌కు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన తమిళ ఆడియో విడుదలను మలేషియాలో విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాని అక్టోబర్ 2న విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కావడం లేదట. తెలుగుతో పాటు తమిళంలో కూడా సైజ్ జీరో ఒకేరోజున విడుదల కావాలని నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే తమిళనాట అక్టోబర్ 2న విజయ్ పులి రిలీజ్ అవుతుండటంతో నిర్మాతలు మరో రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినపడుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz