స్మగ్లర్లు, దొంగల్ని హీరోలుగా చూపిస్తున్నారు


Send us your feedback to audioarticles@vaarta.com


ప్రస్తుతం సినీ రంగంలో నడుస్తున్న ట్రెండ్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. సినిమాల్లో హీరో పాత్రల్ని మలిచే దర్శకులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రలపై తనకు అసంతృప్తి ఉందన్నారు.
నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని, కానీ ఇప్పుడు హీరోలను స్మగ్లర్లు, దొంగలుగా చూపిస్తున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.
చెడ్డ పనుల్ని ఎప్పుడూ గొప్పగా చూపించకూడదని, అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి. సినిమా రంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు మంచి చెప్పేందుకు ప్రతి మేకర్ ఆలోచన చేయాలని కోరారు.
ప్రతి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉండరని, వాళ్లను ఆదర్శంగా తీసుకొని నేటితరం హీరోలు నడుచుకోవాలన్నారు. జుగుప్సాకరమైన, అశ్లీలమైన సన్నివేశాల్ని, పదాల్ని సినిమాల్లో తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com