'స్నేహమేరా జీవితం' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

ఇది మా అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ' సినిమాతో తెరంగేట్రం చేసి ఆర్య', సంక్రాంతి', పోతేపోనీ', చంద‌మామ‌', శంభో శివ శంభో'వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి స్నేహమేరా జీవితం' అనే టైటిల్ ను నిర్ణయించారు. పడ్డానండీ ప్రేమలో మరి'వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 14న శివబాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రంలో శివబాలాజీతో పాటు ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు.

సినిమా మొదటి షెడ్యూల్ పూర్తైంది. సినిమా చాలా బాగా వస్తుంది. సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతం, భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, మాటలు: కిట్టు విస్సా ప్రగడ, కథా విస్తరణ: విద్యాసాగర్ రాచకొండ, పాటలు: బాలాజీ, చైతన్య వర్మ,నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.

More News

'నువ్వే కావాలి' కి 15 ఏళ్లు

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ''నువ్వే కావాలి''ది ప్రత్యేక స్థానం.అప్పటివరకు బాలనటుడుగానే పరిచయమున్న తరుణ్ ఈ సినిమాతోనే కథానాయకుడుగా తొలి అడుగులు వేశాడు.

ఆ వార్త లో వాస్తవం లేదంటున్న ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నారు.సుకుమార్ తెరకెక్కిస్తున్న నాన్నకు ప్రేమతో..చిత్రాన్ని సంక్రాంతికి కానుక గా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

3 రోజుల్లో..టాప్ 3 ప్లేస్ లో 'రుద్రమదేవి'

అగ్ర కధానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ రుద్రమదేవి.

చరణ్ దగ్గర డబ్బులు లేవట...

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి..? ఇదేదో కామెడీ అనుకుంటే పొరపాటే.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..

బ్రూస్ లీ సెంటిమెంట్ ఫాలో కాలేదా...?

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రూస్ లీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.