సుశాంత్‌ది హత్యేనంటూ సంచలనం రేపుతున్న పోస్ట్!

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా యావత్భారతాన్ని కలిచివేసింది. ఆయన మృతిపై హత్యని.. కాదు ఆత్మహత్యని భిన్న వాదనలు వినిపించాయి. కాగా.. ఇటీవలే పోలీసులు ఆయనది ఆత్మహత్యేనని తేల్చేశారు. అయితే సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్యేనని పేర్కొంటున్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలీ, మహేష్ భట్ కలిసి సుశాంత్‌ని హత్య చేశారనేది ఆ పోస్టు సారాంశం. దీనిపై సీబీఐ ఎంక్వైరీ కూడా కోరుతున్నారు.

సుశాంత్ మేనేజర్ దిశ... సూరజ్ కారణంగా గర్భవతి అవడంతో ఆమెను హత్య చేశాడని.. విషయం తెలుసుకున్న సుశాంత్‌.. ఆధారాలతో మీడియా ముందుకు వద్దామనుకునే సరికి కొన్ని అదృశ్య శక్తుల సాయంతో హత్య చేయించారని పోస్టులో పేర్కొన్నారు. సూరజ్‌కు ఇది కొత్తేమీ కాదని.. గతంలో హీరోయిన్ జియాఖాన్‌ను కూడా ఇలాగే హత్య చేయించాడని.. పేర్కొన్నారు. అయితే సుశాంత్ హత్యలో సల్మాన్‌తో పాటు మహేష్ భట్ హస్తం కూడా ఉందని పోస్టులో పేర్కొన్నారు.

More News

చిరు 153 లిస్టులో మ‌రో హీరోయిన్‌!!

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.

ప‌వ‌న్ మొద‌లెట్టేద‌ప్పుడేన‌ట‌!!

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇండిపెండెన్స్ డే  కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో