సోగ్గాడి ఓవర్ సీస్ రికార్డ్...

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

ఈ సంక్రాంతి రేసులో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా' విన్న‌ర్‌గా నిలిచింది. నాగార్జున కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళ‌ను క‌లెక్ట్ చేస్తున్న చిత్రంగా నిలిచింది. ఇక్కడొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే తొలి దర్శ‌కుడుగా కళ్యాణ్ కృష్ణ కొత్త రికార్డుకు నాంది ప‌లికాడు. వివ‌రాల్లోకెళ్తే..'మిర్చి' చిత్రంతో కొర‌టాల శివ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయ్యాడు. మిర్చి సినిమా ఓవ‌ర్‌సీస్‌లో 631 కె. డాల‌ర్స్ ను రాబ‌ట్టుకుంది. నూత‌న ద‌ర్శ‌కుడికి ఆ రేంజ్‌లో ఓవ‌ర్‌సీస్‌లో క‌లెక్ష‌న్స్ రావ‌డం అప్ప‌ట్లో రికార్డ్ అయింది. ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే ఆ రికార్డుని దాటేసింది. 661కె. డాలర్స్ ను క‌లెక్ట్ చేసి మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ వైపు దూసుకెళుతుంద‌ట‌. ఈ రకంగా కొరటాల శివను కళ్యాణ్ కృష్ణ దాటేశాడట.

More News

సెన్సార్ సన్నాహాల్లో 'ప్రేమంటే సులువు కాదురా'

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్. యువ ప్రతిభాశాలి చందా గోవింద్రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

మరో రీమేక్ ప్లాన్ లో చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ను ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభించనున్నారు.

అ..ఆ నుంచి అనిరుథ్ అవుట్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నచిత్రం అ..ఆ.నితిన్ హీరోగా నటిస్తున్న అ..ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది.

మూడో షెడ్యూల్ లో 'షీ'

కల్వకుంట్ల తేజేశ్వర్‌ రావ్‌(కన్నారావ్‌) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'.

'నాన్న‌కు ప్రేమ‌తో' ర‌చ‌యిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా 'మీకు మీరే మాకు మేమే''

ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌య్యిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్ర ర‌చయిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా మారి మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని నిర్మించారు.