‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చిత్రబృందానికి శుభాకాంక్షల వెల్లువ

  • IndiaGlitz, [Monday,November 30 2020]

మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇటీవల ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. థియేటర్లు అయితే సిద్ధం కానీ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు మాత్రం ముందుకు రావడం లేదు. 50 శాతం సీటింగ్‌తో అంటే తమకు నష్టాలొస్తాయని నిర్మాతలు భావించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే మెగా హీరో సాయితేజ్‌తో పాటు ‘సోలో బ్రతుకే సో బెటర్’ నిర్మాతలు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నారు.

ఈ క్రమంలోనే 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం విడుదల డేట్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్‌ 25న క్రిస్టమస్‌ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో 'సోలో బ్రతుకే సో బెటర్‌' యూనిట్‌కి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. సోషల్ మీడియా వేదికగా.. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సాయితేజ్‌, చిత్రయూనిట్‌ ధైర్యానికి అభినందనలు తెలియజేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. సుమంత్‌ హీరోగా తెరకెక్కిన 'కపటధారి' చిత్రం కూడా డిసెంబర్‌లోనే విడుదల చేస్తామని చెప్పారు కానీ.. ఇంకా డేట్‌ ప్రకటించలేదు. కాగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ చిత్రం తెరకెక్కింది. మరో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ భామ న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టించింది. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో ఆసక్తికరంగా మారింది.

More News

ఇదే నిజమైతే.. టీఆర్ఎస్ ఖేల్ ఖతమే..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

110 మంది రైతుల దారుణ హత్య.. పొలాల్లో గుట్టలుగా శవాలు

పొలం పనులకు వెళ్లిన 110 మంది వ్యవసాయ కూలీలను అమానుషంగా హతమార్చిన ఘటన ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగరానికి సమీపంలో కోషోబ్‌ అనే గ్రామంలో

కుమార్తె పెళ్లి సంబంధం కోసం వెళ్తూ.. అమెరికాలో తెలుగు వారి మృతి

అమెరికాలో కుమార్తె వివాహ సంబంధం కోసం ఓ తెలుగు వారికి చెందిన కుటుంబం బయల్దేరింది. అంతే కొన్ని క్షణాల్లోనే కుటుంబంలోని ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లగా..

గెస్ట్‌గా కిచ్చా సుదీప్ ఎంట్రీ.. ఈ వారం అంతా సేఫ్..

‘సోగ్గాడే చిన్ని నాయనా’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. హోస్ట్ నాగార్జున సాంగ్స్ మెడ్లీతో కంటెస్టెంట్‌లంతా ఇరగదీశారు.

కొత్త ఏటిటిలో డిసెంబ‌ర్ 18న విడుద‌ల అవ్వ‌బోతున్న 'డ‌ర్టీ హ‌రి'

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు