close
Choose your channels

'సోలో బ్రతుకే సో బెటర్‌' టైటిల్‌ ట్రాక్‌ విడుదల

Friday, December 11, 2020 • తెలుగు Comments

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ ట్రాక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని పీవీఆర్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా...

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ - "తమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. తనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. సినిమాలోని నాలుగు పాటలు విడుదలైతే అన్నింటి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తను పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. రఘురామ్‌గారు, కాసర్ల శ్యామ్‌గారు చాలా క్యాచీ పాటలు రాశారు. సినిమాలో రఘురామ్‌గారు రాసిన నో పెళ్లి.. సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్‌కు లిరికల్‌ వీడియో సాంగ్‌ కూడా చేశాం. అందులో రానా, వరుణ్‌ కూడా నటించారు. సాంగ్‌ను నితిన్‌ లాంఛ్‌ చేశారు. వీరి ముగ్గురికీ థాంక్స్‌. డైరెక్టర్‌ సుబ్బు గురించి చెప్పాలంటే .. తనకు డేడికేషన్ ఉన్న పర్సన్‌. కన్విక్షన్‌తో పనిచేశాడు. తను కథ చెప్పేటప్పుడు ఎంత కసితో చెప్పాడో సినిమాను అంతే కసిగా పనిచేశాడు. అందరినీ కన్విన్స్‌ చేస్తూ తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబ్టటుకున్నాడు. తనకు మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. తను ఐదు సినిమాలు చేసేసి ఊరెళ్లిపోతానని అన్నాడు. కానీ..నాకు మాత్రం తను యాబై సినిమాలు చేయాలనుంది. ఓ మంచి పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెబుతూ ఎమోషన్స్‌ను మిక్స్‌ చేసి సినిమాను తెరకెక్కించాడు. సుప్రీమ్‌ తర్వాత రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి చేసిన సినిమా ఇది. ఆయన నాకు మంచి ఎనర్జీని ఇచ్చారు. రావు రమేశ్‌గారితో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాల తర్వాత కలిసి నటించాను. మా సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో సెకండ్‌ హ్యాట్రిక్‌కి నాందిపలికాం. ఇక ఈ టైటిల్‌ ట్రాక్‌ విషయానికి వస్తే సీతారామశాస్త్రిగారు పాట రాశారు. ఆయన కూడా క్యాచీ ట్యూన్‌కి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలా? లేక థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలా? అని అనుకుంటున్నప్పుడు .. ముందు ఓటీటీలోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. ఒకవేళ థియేటర్స్‌ ఓపెన్‌ అయితే థియేటర్స్‌లో సినిమాను విడుదల చేద్దామని అనుకున్నాం. జీ స్టూడియోస్‌ సంస్థ ఈ విషయంలో ఎంతో సహకారాన్ని అందించింది. నభా అద్భుతంగా, పాత్రను క్యారీ చేసింది. ప్రేక్షకులు మాకు సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం" అన్నారు.

చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ "మే 1న సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కోవిడ్‌ వల్ల ఆలస్యమైంది. సాయితేజ్‌ను అడిగితే మీకు ఎది మంచిది అనిపిస్తే అదే చేయండని తన సపోర్ట్‌ను అందించాడు. జీ స్టూడియో ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. అదే సమయంలో థియేటర్స్‌ ఓపెన్‌ చేస్తున్నాం అని అనౌన్స్‌ చేశారు. దాంతో జీ స్టూడియో సహకారంతో సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. డిసెంబర్‌ 25న సినిమా విడుదలవుతుంది. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని సినిమా చూడండి" అన్నారు.

దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ - "సాయితేజ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. కథను, నన్ను నమ్మి సినిమా చేసినందుకు ముందుగా ఆయనకు థాంక్స్‌. ఓ డెబ్యూ డైరెక్టర్‌లా కాకుండా ఓ ఫ్రెండ్‌లా నాకు సపోర్ట్‌ చేశారు. ఆయన వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సిరివెన్నెలగారు మా సినిమాలో టైటిల్‌ పాట రాయడం ఎంతో ఆనందంగా ఉంది. యంగ్‌ టీమ్‌.. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. బీవీఎస్‌ఎన్‌గారు, బాపినీడు తమ కుటుంబ సభ్యుడిలా భావించి సపోర్ట్‌ను అందించారు. కోవిడ్‌ ప్రభావం తర్వాత మొదటి విడుదలవుతున్న సినిమా మాదే. డిసెంబర్‌ 25న సినిమా విడుదలవుతుంది. అందరూ సినిమాను చూసి ఎంకరేజ్‌ చేయండి" అన్నారు.

జీ స్టూడియోస్‌ ప్రతినిధి నీరజ్‌ జోషి మాట్లాడుతూ "సోలోబ్రతుకే సోబెటర్‌ సినిమాను మా జీ స్టూడియో అసోసియేషన్‌తో కలిసి విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాను విడుదల చేయడానికి ఇది రైట్‌ టైమ్‌ అని అనుకుంటున్నాను. డిసెంబర్‌ 25న సినిమా విడుదలవుతుంది" అన్నారు.

రావు రమేశ్‌ మాట్లాడుతూ - "మనం ఎప్పుడు చూసినా తుది గెలుపు సినిమాదే. ఈ కోవిడ్‌ సమయంలోనూ సినిమాదే గెలుపు. పాటలు అందరికీ నచ్చేశాయి. పాటలు తప్పకుండా హిట్‌ అవుతాయి. సాయితేజ్‌తో మూడు సినిమాలు చేశాను. ఇది నాలుగో సినిమా. మా కాంబినేషన్‌ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ - "ఆరేడు నెలల అజ్ఞాతవాసం తర్వాత సినీ ఇండస్ట్రీ పాండవుల్లా యుద్ధానికి బయలుదేరింది. సాయికి పక్కాగా సూట్‌ అయ్యే క్యారెక్టర్‌ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుంది" అన్నారు.

ఈ కార్యక్రమంలో లిరిక్‌ రైటర్స్ కాసర్లశ్యామ్‌, రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz