లంకా దినకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం!

  • IndiaGlitz, [Tuesday,October 20 2020]

బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ గురించి తెలియని వారుండరు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీపై, అటు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడంలో దిట్ట. జాతీయ స్థాయి మీడియాలో ఆయన తరుచూ కనిపిస్తూ ఉంటారు. దీంతో ఆయన నేషనల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు సాధించారు. తాజాగా ఈ అంశమే ఆయనకు పత్రికూలంగా మారింది. లంకా దినకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. దినకర్‌‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ సోమూ వీర్రాజు ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందును పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ ఆఫీస్ సెక్రెటరీ శ్రీనివాసరావు పేరుతో లంకా దినకర్‌కు సస్పెన్షన్ లేఖ అందింది.

కాగా.. జూలై 26న జరిగిన మీడియా చర్చలో లంకా దినకర్ పాల్గొన్నందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని బీజేపీ వెల్లడించింది. అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేశామని పార్టీ పేర్కొంది. దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు.

More News

తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్..

తెలంగాణ సీఎం కేసీఆర్.. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

యాపిల్‌పై షియోమీ సెటైరికల్ వీడియో.. మిలియన్లలో వ్యూస్..

అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్‌పై చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ సెటైరికల్‌గా వీడియో విడుదల చేసింది.

తొలిసారి నామినేషన్స్‌లో అవినాష్..

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నేటి షోలో నామినేషన్స్ జరిగాయి. ఇంతకు ముందు వారాలతో పోలిస్తే..

‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి..

శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు.

30 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోండి: భారతీరాజా

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీ రాజా నటీనటులకు ఒక సూచన చేశారు.