పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. కీలక విషయాలపై చర్చ

  • IndiaGlitz, [Friday,August 07 2020]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన తొలిసారిగా పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన కీల‌క అంశాల్ని ఈ భేటీలో చర్చించారు. ముఖ్యంగా ఆ ఇద్ద‌రి భేటీలో మూడు రాజధానుల అంశంతో పాటు.. ఆంధ్రప్ర‌దేశ్ అభివృద్ధి అంశంపైనే చ‌‌ర్చ సాగినట్టు తెలుస్తోంది.

ఆర్థికంగా, సామాజికంగా, నిర్మాణాత్మ‌కంగా ఇరు పార్టీలూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన ప్లాన్ చేసేందుకు ఈ క‌ల‌యిక అని తెలుస్తోంది. త్వ‌ర‌లో వీరిద్దరి భేటీ మరోసారి జరగనుందని.. అప్పుడు ముఖ్యంగా 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళికను రూపొందించనున్నట్టు సమాచారం. కాగా.. నిన్న సోము వీర్రాజు.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. నేడు పవన్‌ని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

More News

మ‌రో యంగ్ హీరో జోడీగా కేతికాశ‌ర్మ‌

ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’లో హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అభిమానుల‌కు మ‌హేశ్ రిక్వెస్ట్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 9.. రెండు రోజుల వ్య‌వ‌థి మాత్ర‌మే ఉంది.

మెగాస్టార్‌తో మెహ‌ర్ చేయ‌బోయేది ఆ రీమేకా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌రుస సినిమాలు తెర‌కెక్క‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయి.

తెలంగాణలో కొత్తగా 2207 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

3 రాజధానులపై అధికార, విపక్షాల తాజా కలవరమిది!

మూడు రాజధానుల విభజన అంశం అటు అధికార పార్టీ, ఇటు విపక్ష నేతలు కొందరిలో కల్లోలం రేపుతోంది.