సోనూసూద్ టీం లేకుంటే ఆ 22 మంది ఏమైపోయేవారో..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఫలితం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షల సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. సమయానికి ఆక్సిజన్ అందక ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో సోనూసూద్ దేశంలో బాధితులందరికీ అండగా నిలుస్తున్నారు. రాష్ట్రమేదైనా కానీ.. సాయం అని అడిగితే చాలు.. క్షణాల్లో వారి అవసరాన్ని తీరుస్తున్నారు. కర్ణాటకలో సోనూసూద్ బృందం కారణంగా దాదాపు 22 మంది రోగుల ప్రాణాలు నిలిచాయి.

Also Read: కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్..

అసలు విషయంలోకి వెళితే బెంగుళూరులోని అరక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో ఆ ఆసుపత్రిలో దాదాపు 22 మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారు. విషయం తెలుసుకున్న సత్యనారాయణన్ అనే పోలీస్ అధికారి ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ సోనూసూద్ బృందానికి మెసేజ్ చేశారు. అప్పటికే ఆసుపత్రిలో ఇద్దరు రోగులు ఆక్సిజన్ లేకపోవడంతో మరణించారు. ఇంకా దాదాపు 22 మందికి ఆక్సిజన్ అందాల్సి ఉంది. వేరే గత్యంతరం లేక ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణన్ సోనూసూద్‌ టీంను ఆశ్రయించారు.

సత్యనారాయణన్ చేసిన మెసేజ్‌ చూసిన సోనూసూద్ బృందం క్షణాల వ్యవధిలో 16 ఆక్సిజన్ సిలిండర్లను అరక్ ఆసుపత్రికి అందించింది. విషయం తెలుసుకున్న సోనూసూద్ తమ వలంటీర్లను అభినందించారు. ఇది టీమ్ వర్క్‌కు నిదర్శనమని.. ఇలాగే పని చేస్తూ దేశ ప్రజలకు అండగా నిలుస్తామని సోనూసూద్ వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ నుంచి సమాచారం అందిన వెంటనే ఆసుపత్రి వివరాలను ధ్రువీకరించుకుని కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి చేర్చామని సోనూ తెలిపారు. ఏమాత్రం ఆలస్యమైనా.. సదరు రోగులు ప్రాణాలు కోల్పోయే వారిని.. వెంటనే స్పందించిన తమ టీంకు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.

More News

సీఎంగా మమత ప్రమాణ స్వీకారం.. పదవిలో కొనసాగాలంటే..

టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్..

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ హాజరయ్యారు.

ఎవరెప్పుడు పోతారో తెలియట్లేదు: జగపతిబాబు భావోద్వేగం

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా..

ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మినీ మునిసిపల్ ఎన్నికలు ముగిశాయో లేదో..

హైదరాబాద్ జూలోని 8 సింహాలకూ కరోనా.. అసలెలా సోకిందంటే..

కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో ప్రళయం సృష్టిస్తోంది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం వ్యాపించి షాకిస్తోంది.