సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది. వలస కూలీలను తమ తమ ఇళ్లకు చేర్చి వారి కళ్లకు భగవంతుడిలా కనిపించారు. ఇక వేరే దేశంలో చిక్కుకు పోయిన వారిని సైతం స్వదేశానికి రప్పించి రియల్ హీరో అయిపోయారు. ఇక సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ఆయన చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. సూద్ ఫౌండేషన్‌ను నెలకొల్పి కష్టంలో ఉన్నామంటూ ఎవరైనా మెసేజ్ చేస్తే చాలు.. క్షణాల్లో వారి కష్టాన్ని తీర్చేస్తున్నారు. ఇప్పుడు కష్టంలో ఉన్నవారికి తమ రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే కేంద్ర ప్రభుత్వమో గుర్తుకు రావడం లేదు.. సోనూసూద్ మాత్రమే గుర్తుకొస్తున్నారు.

తాజాగా.. దర్శకుడు మెహర్ రమేష్ ట్విటర్‌లో వెంకట రమణ అనే పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరారు. కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు. ఈ విషయాన్ని మెహర్ రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ పంపించిన మెడిసిన్‌‌ను సైతం మెహర్ రమేష్ ట్విటర్‌లో షేర్ చేశారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లతో పాటు అడిగిన వారికి మెడిసిన్‌ను సైతం అందిస్తూ కష్టంలో ఉన్నవారి పాలిట ఆపద్భాందవుడిలా మారారు.

More News

ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

జీ 5లో 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఎక్స్‌క్లూజివ్‌ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు  సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5.

హీరోలూ జీరోలవకండి.. కాస్త ఊపిరి అందించండి..

ప్రస్తుతం భారతదేశం ఎంత ప్రమాద స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్ళపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనిలో భారీ ప్రమాదం జరిగింది.

కొవిడ్‌ వ్యాక్సిన్ కొరత.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో కొవిడ్‌ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.