close
Choose your channels

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

Tuesday, November 24, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

సోనూ సూద్ రీల్ విలన్ కాస్తా.. కరోనా మహమ్మారి దేశంలోకి ఎంటర్ అవగానే రియల్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడిలా మారారు. అవసరమున్న వారికల్లా సాయమందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు అనూహ్యంగా అభిమాన గణం పెరిగిపోయింది. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం ఆయనను స్టేట్ ఐకాన్‌గా నియమించింది. తాజాగా సోనూ సూద్ మరో ఘనతను కూడా దక్కించుకున్నారు.

ఇటీవలి కాలంలో సోనూసూద్‌కు ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. అది ఎంతలా పెరిగిందంటే.. బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి సోనూ సూద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో అత్యధిక ఫాలోయింగ్ (ట్విటర్) కలిగిన వ్యక్తుల జాబితాలో సూనూ సూద్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఫాలోయింగ్ విషయంలో సోనూసూద్.. బాలీవుడ్ ప్రముఖులందరినీ వెనక్కి నెట్టేయడం గమనార్హం.

Get Breaking News Alerts From IndiaGlitz