ఇంకెన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితి..: సోనూసూద్

  • IndiaGlitz, [Saturday,December 19 2020]

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్‌ రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయక ఆందోళన నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. అయితే ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

తాజాగా దీనిపై సోనూసూద్‌ స్పందించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'వి ది ఉమెన్‌'అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్‌ రైతుల ఆందోళనలపై మాట్లాడుతూ ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదన్నారు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నానన్నారు. రైతులతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను కూడా పంజాబ్‌లోనే పుట్టి పెరిగానన్నారు.

రైతులు చేస్తున్న ఈ పోరాటంలో భాగంగా కొందరు రైతులు ప్రాణాలను సైతం కోల్పోయారని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో పనిచేసుకుంటూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై చలికి వణుకుతూ ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. ఇంకా ఎన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదని... ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేమని సోనూసూద్ పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా సోనూ.. ‘రైతులు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీట్ చేసి వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

More News

'హ‌ర్లా ఫర్లా' సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న విశాల్ 'చ‌క్ర'

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`.  శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది.

తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.

నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్

తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీకి రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన ఏపీ..

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.