close
Choose your channels

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

Friday, July 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సన్నిహితులు బహుమతులిచ్చి సర్‌ప్రైజ్ చేయడం కామన్‌. కానీ రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో సోనూసూద్ విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. జులై 30 సోనూసూద్ పుట్టినరోజు. ఆయన రియల్ లైఫ్ హీరోగా మారాక వచ్చిన తొలి పుట్టినరోజు. సోషల్ మీడియా దద్దరిల్లేలా.. విషెస్ వెల్లువలా వచ్చాయి. అయితే ఆయనకు ఎవరు ఏమేమి బర్త్ డే గిఫ్ట్స్ ఇచ్చారో కానీ తాను మాత్రం వలస కూలీలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. వారి జీవితాలను బాగు చేసే గిఫ్ట్ అది.

కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సోనూ వెల్లడించారు. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు PravasiRojgar.com లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి’’ అని సోనూసూద్ ట్వీట్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు కొండంత అండగా నిలిచిన సోనూసూద్ నేడు వారి కోసం మరో అడుగు ముందుకు వేయడం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.