పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరింత మందికి సాయం అందిస్తున్నారు. ఆయన సాయం పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. సెలబ్రిటీలు సైతం తమకు మెడిసిన్, ఆక్సిజన్ వంటివి అవసరమైతే సోనూనే అర్థిస్తున్నారు. అడిగిన వెంటనే క్షణాల్లో వారికి అవసరమైన మందులు, ఆక్సిజన్, హాస్పిటల్‌లో బెడ్ వంటివి సోనూ అరేంజ్ చేస్తున్నారు. సూద్ ఫౌండేషన్ పేరుతో ఆయన అందిస్తున్న సేవ అంతా ఇంతా కాదు. ఆయనతో పాటు అతని ఎన్‌జీవో సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు.

Also Read: ‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట

ఇటీవల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్) వద్ద ఆక్సిజన్ లీక్‌ను అక్కడి పోలీసుల బృందంతో కలిసి ఆసుపత్రి సిబ్బంది గుర్తించింది. ఆక్సిజన్ లీక్ విషయం తెలిసిన వెంటనే సోనూసూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. దీంతో 30 మంది ప్రాణాలు నిలిచాయి. లీక్‌ను గుర్తించిన సమయంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా గంట మాత్రమే మిగిలి ఉంది. ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సమిత్ హవినల్ వెంటనే సంక్షోభం నుంచి బయటపడటానికి సోనూసూద్ ఫౌండేషన్, మేఘా చౌదరి, పోలీసు హెల్ప్‌లైన్ బృంద సభ్యులను సంప్రదించారు.

వెంటనే స్పందించిన సోనూసూద్ బృందం కొన్ని ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. అవి సరిపోవని భావించడంతో వెంటనే వారు సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లను సంప్రదించడం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, రీమా సువర్ణ, ఆసుపత్రి యాజమాన్యం క్లిష్టమైన పరిస్థితుల్లో వెంటనే స్పందించినందుకు సోనూసూద్ బృందాన్ని ప్రశంసించారు.

More News

ప్రముఖ రచయిత-దర్శకుడు నంద్యాల రవి ఇక లేరు..

‘నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు’ వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంతో దర్శకుడిగా మారిన నంద్యాల రవి(42) శుక్రవారం

గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఎంతో మంది రోగులు ఆసుపత్రిల్లో బెడ్స్‌పై బతుకుతామనే ఆశను ఊపిరిగా చేసుకుని గడుపుతున్నారు.

తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్

తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు అంబులెన్స్‌లను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట

కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా మూవీ అప్‌డేట్స్ ఏవీ లేకుండా పోయాయి.

అంద‌రి దృష్టి ఇటే!... నేడే స్పార్క్ ఓటీటీ ప్రారంభం!

క‌రోనా సెకండ్ వేవ్ వినోద రంగంలో ఓటీటీ విస్త‌ర‌ణ‌కు మ‌రో మంచి అవ‌కాశం కల్పించింది. ఇప్ప‌టికే ఈ రంగంలో కొన‌సాగుతున్న ఓటీటీ వేదిక‌ల‌కు పెను స‌వాల్ విసురుతూ ‘స్పార్క్ ఓటీటీ’ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది.