close
Choose your channels

సోనూసూద్‌కి కరోనా.. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారుగా..

Sunday, April 18, 2021 • తెలుగు Comments

సోనూసూద్‌కి కరోనా.. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారుగా..

కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించిన సమయంలో ప్రముఖ నటుడు సోనూసూద్ అందించిన సేవలు ఎవరూ మరచిపోలేరు. వలస కూలీలు మొదలు.. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వస్థలాలకు చేర్చే వరకూ ఆయన సేవలు మరువలేనివి. చాలా మంది వలస కూలీలు ఆయన్ను ఒక దేవుడిలా భావిస్తారు. ఇప్పటికీ ఆయన పేరుతో హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు పెట్టి తమ కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో పూర్తి స్థాయిలో రోడ్లపైనే ఉండి సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

ప్రస్తుతం ఆయన తన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఓ పాజిటివ్ వేలో సోనూ వెల్లడించిన తీరు ఆకట్టుకుంటోంది. ట్విటర్ వేదికగా తన పాజిటివ్ అన్న విషయాన్ని సోనూ వెల్లడించారు. ‘కోవిడ్ పాజిటివ్. మూడ్, స్పిరిట్ సూపర్ పాజిటివ్’ అంటూ తనకు కోవిడ్ సోకిన విషయాన్ని సోనూసూద్ వెల్లడించారు. ఇప్పటికే తాను క్వారంటైన్ అయ్యానని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని సోనూ వెల్లడించారు.

‘‘హాయ్ ఎవ్రీ వన్, నాకు ఇవాళ(శనివారం) కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నేను ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నాను. కరోనా నివారణకు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నా. కానీ ఇందులో ఆందోళన చెందాల్సిందేమీ లేదు. మీ సమస్యలను పరిష్కరించేందుకు నాకు సమయం దొరికింది. మీ అందరి కోసం నేనున్నానని ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి’’ అంటూ ఒక అద్భుతమైన సందేశాన్ని సైతం ఆయన అందించారు. సోనూసూద్ వెల్లడించారు. ప్రస్తుతం సోనూ ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz