close
Choose your channels

‘శివ’ ఆదర్శంతో సేవ చేయండి : సోను సూద్

Tuesday, January 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘శివ’ ఆదర్శంతో సేవ చేయండి : సోను సూద్

నిస్వార్ధంగా సమాజానికి సేవలు అందించే ట్యాంక్ బండ్ శివ లాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోను సూద్ అన్నారు. హుస్సేన్ సాగర్‌లో గుర్తుతెలియని శవాలను వెలికితీసే శివ తనకు వచ్చిన విరాళాలతో ఎదుటి వారికి సేవ చేయాలన్న సంకల్పంతో అంబులెన్స్‌ను కొనుగోలు చేశారు. కరోనా కాలంలో అన్నార్తులను పేదలను ఆదుకున్న సోనుసూద్ తనకు ఆదర్శమని, ఆయన కనిపించే దైవం అని భావించి తను కొనుగోలు చేసిన అంబులెన్స్‌కు సోను సూద్ అంబులెన్స్ సర్వీస్‌గా నామకరణం చేశారు. అంతేకాదు.. ఆ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించడానికి స్వయంగా తాను దేవుడిగా భావించే సోనూసూద్‌ను ఆహ్వానించి మంగళవారం నాడు ట్యాంక్ బండ్‌పై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ట్యాంక్ బండ్ పైన ఉన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు.

‘శివ’ ఆదర్శంతో సేవ చేయండి : సోను సూద్

ఈ సందర్భంగా రియల్ హీరో మాట్లాడుతూ.. ఆపద సమయంలో ఉన్న వారిని ఆదుకోవడానికి శివ చేస్తున్న కృషిని ప్రశంసించారు. శివను ఆదర్శంగా తీసుకొని యువత సేవాభావాన్ని అలవర్చుకొని ఎదుటి వారికి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ వివిధ రూపాల్లో అనేకమంది తనకు అందించిన విరాళాలతో స్వలాభం కోసం వినియోగించకుండా ఏదైనా సేవా కార్యక్రమానికి ఉపయోగించాలన్న సంకల్పంతో అంబులెన్స్ వాహనాన్ని కొనుగోలు చేశానని పేర్కొన్నారు. అహాన్ని సోనూసూద్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో తనకు సహకరించిన ప్రతి ఒక్కరి నమ్మకానికి విశ్వాసానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. కాగా.. ట్యాంక్‌బండ్, హుస్సేన్‌ సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఎంతో మందిని రక్షించడమే కాకుండా.. అనాథ శవాలకు అన్నీ తానై అంత్యక్రియలను కూడా శివ చేస్తూ భాగ్యనగర వాసుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.