సౌత్ సినిమాల యూ ట్యూట్ రికార్డులు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా సినీ ప్రేక్షకులు భాషలతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ కోవలో యూ ట్యూబ్, డిజిటల్ మాధ్యమాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్లు సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. దీంతో సినిమాల మధ్య ఉన్న హద్దులు అంతరిస్తున్నాయి. యూ ట్యూబ్ విషయానికి వస్తే మన దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా మన తెలుగు చిత్రాలను హిందీలో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. మన తెలుగు సినిమాల పాటలకు, టీజర్స్, అనువాద చిత్రాలకు యూ ట్యూబ్‌లో అత్యంత ఆదరణ దక్కుతుంది.
వివరాల్లోకెళ్తే... లేటెస్ట్గా రామ్ హీరోగా నటించిన `హలో గురూ ప్రేమ కోసమే` సినిమాను `ధూమ్ ధామ్ ఖిలాఢీ` పేరుతో హిందీలో అనువాదం చేసిన యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ అనువాద చిత్రానికి ఏకంగా వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి. ఓ దక్షిణాది చిత్రానికి ఇన్ని లైక్స్ రావడం ఇదే ప్రథమం. రీసెంట్ టైమ్స్‌లో చూస్తే బన్నీ నటిస్తోన్న `అల వైకుంఠ పురములో` పాటల్లో సామజవరగమన సాంగ్ 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంటే..రెండో సాంగ్ `రాములో రాముల..` 80 మిలియన్స్‌ను రాబట్టుకుంది. ఇక మహేశ్ సరిలేరు నీకెవ్వరు టీజర్ అయితే 24 గంటల్లోనే దాదాపు 15 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. ఇదే సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.
మరి ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోల టీజర్స్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో భాగమైన యూ ట్యూబ్‌లో ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.