close
Choose your channels

చదువుకుంటూనే పాటలు.. 'మర్యాద రామన్న'తో సినీ ప్రస్థానం

Friday, September 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చదువుకుంటూనే పాటలు.. మర్యాద రామన్నతో సినీ ప్రస్థానం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1:04గంటలకు పరమపదించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1964 జూన్ 4న  నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్న పెద్ద కుటుంబములో బాలు రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. ఒకపక్క చదువుకుంటూనే మరోవైపు వేదికలపై బాలు పాటలు పాడుతూ అనేక బహుమతులు సాధించారు.

‘మర్యాదరామన్న’ సినీ ప్రస్థానం..

1966లో పద్మనాభం నిర్మించిన మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా బాల సుబ్రహ్మణ్యం ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత ఆయనకు వరుస అవకాశాలు వరించాయి. తొలుత తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. నటుల హావభావాలకు అనుగుణంగా పాటలు పాడటంలో దిట్ట. అలా అనుకోకుండానే 40 వేల పాటలు అవలీలగా పాడేశారు. బుల్లితెరపై కూడా బాలు రాణించారు. పాడుతా తీయగా, పాడాలని ఉంది వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం సినీరంగానికి పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం వంటి కార్యక్రమాలతో తన గాన మాధుర్యాన్ని తెలుగు ప్రజానీకానికి అందజేశారు.

చదువుకుంటూనే పాటలు.. మర్యాద రామన్నతో సినీ ప్రస్థానం

నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా..

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గాయకుడిగానే కాకుండా నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998), మిథునం (2012) తదితర చిత్రాల్లో నటించి అద్భుతమైన నటుడిగా పేరు గడించారు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్ర దానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ వంటి ఎందరో నటీనటుల పాత్రలకు తన గొంతుకతో ప్రాణం పోశారు.

చదువుకుంటూనే పాటలు.. మర్యాద రామన్నతో సినీ ప్రస్థానం

2011లో పద్మభూషణ్..

బాలుకు కేంద్ర ప్రభుత్వం.. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందించి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను బాలుకి నంది ప్రత్యేక బహుమతి లభించింది.

ఇదీ చదవండి: లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.