మరింత విషమించిన గాన గంధర్వుడి ఆరోగ్యం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ఆగస్ట్ తొలి వారంలో కరోనా బారిన పడిన ఆయన అప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే నేటి సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. తాజాగా ఆసుపత్రి వర్గాలు బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

‘‘కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎంజీఎం హెల్త్ కేర్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్సను అందిస్తున్నాం. గడిచిన 24 గంటల్లో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఎస్పీబీ ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’’ అని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి.

ఆగస్ట్ 5న తనకు కరోనా సోకిందని.. వైద్యులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోమని సూచించారని.. కానీ ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారని.. తాను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం సడెన్‌గా ఒకరోజు విషమించింది. దీంతో వైద్యులు బాలుని ఐసీయూకి తరలించి ఎక్మో సాయంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తూ వస్తున్నారు.

ఇటీవలే కరోనా నెగిటివ్..

కాగా.. బాలుకి ఇటీవలే పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. అప్పటి నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హెల్త్ బులిటెన్‌లో పలుమార్లు తెలిపారు. బాలు వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీ కూడా చేస్తున్నామని వెల్లడించారు. అంతా బాగుంది.. త్వరలోనే ఇక ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంతోషిస్తుండగా.. నేడు ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 

More News

అర్బన్ మాంక్ లుక్‌.. ‘వేదాళం’లో ఆ పార్ట్ కోసమేనట.. చిరు క్లారిటి

ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అర్బన్ మాంక్‌ లుక్‌లో తొలిసారి చిరు అభిమానుల ముందుకు వచ్చారు.

రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యమివ్వండి: పవన్

అంతర్వేది లక్ష్మీనారసింహుని రథం దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్ సంస్థ

ఇండియన్స్‌కి యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో 'యాపిల్' సంస్థ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే ఈ సంస్థ ఆపరేషన్స్ ఇప్పటి వరకూ

'మేజ‌ర్‌'లో స‌ల్మాన్ హీరోయిన్‌

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి ముష్కరులను మట్టుబెట్టింది.

ఉర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను