ఒక రకంగా నేనే వారికి శాపమేమో.. ఫీలయిన ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఔన్నత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుప్రసిద్ధ గాయకుడిగా ఆయన ఎక్కని మెట్టంటూ లేదు. ఎన్నో అవార్డులు ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సైతం ఆయనను వరించాయి. అయితే బాలు చెల్లి శైలజ, కుమారుడు ఎస్పీ చరణ్ మాత్రం ఆయనంత స్థాయిలో రాణించలేక పోయారు. శైలజ మంచి పేరు సాధించినప్పటికీ.. చరణ్ మాత్రం పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ శైలజకు మంచి గాయనిగా 75 మార్కులు వేస్తానని తెలిపారు.

అయితే మిగిలినవారిని ప్రోత్సహించినట్లు శైలజను, తన కుమారుడిని తాను ప్రోత్సహించలేదని తన సతీమణి ఆరోపిస్తుంటారని బాలు వెల్లడించారు. ఒక రకంగా తానే వారికి శాపమేమో అని బాలు ఫీలయ్యారు. తన పిల్లలకు బాలు చాలా ఆసక్తికరమైన పేర్లు పెట్టారు. పేర్లు ఆసక్తికరమేమీ కాదు కానీ.. ఆ పేర్లు పెట్టడం వెనుక బాలు ఇంటెన్షన్ మాత్రం ఆసక్తికరమే. తన పాటలోని పల్లవి, చరణాలను తన పిల్లలకు బాలు పేర్లుగా పెట్టుకోవడం విశేషం. కుమారుడికి చరణ్(ణం) అని.. కుమార్తెకు పల్లవి అని పేరు పెట్టారు.

ఇక తన పిల్లల గురించి బాలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయి గృహిణి అని.. బాధ్యతల వల్ల పాడడం మానేసిందని తెలిపారు. తన కుమారుడు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడన్నారు. అయితే.. సంగీతం.. నటన... సినిమాలు తీస్తా అన్నాడని పేర్కొన్నారు. 5 సినిమాలు తీశాడని... 11 కోట్లు పోయాయని వెల్లడించారు. ఇంకా సినిమాలు తీసే పనిలో ఉన్నాడని... బాగా కృషి చేస్తున్నాడని వెల్లడించారు. తన కుమారుడికీ, కుమార్తెకూ ఇద్దరికీ కూడా కవలపిల్లలు అని బాలు తెలిపారు. అది తెలిసి తనను కొందరు ‘కవలల తాతయ్య’ అని పిలుస్తుంటారని వెల్లడించారు.

More News

దీపిక ఇంటరాగేషన్ లీక్.. స్కెచ్ అదిరిపోయిందిగా..

బాలీవుడ్‌ను డ్రగ్ కేసు వణికిస్తోంది. ప్రస్తుతం ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను వరుసగా విచారిస్తోంది. నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించింది.

మోనాల్‌కి మంచి కాంపిటీషన్‌గా స్వాతి దీక్షిత్ ఎంట్రీ..

ఇవాళ షోలో ఏమీ లేదనిపించినా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది.

గాన గంధర్వుడి చివరి పాట ఇదే...

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది.

బాలుపై వచ్చిన ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది.

రేపు సాయంత్రం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు.