మంచు ఫ్యామిలీకి ఆ రోజు ప్రత్యేకం

  • IndiaGlitz, [Monday,January 08 2018]

ఈ ఫిబ్ర‌వ‌రి మాసం.. మంచు కుటుంబానికి చెందిన‌ న‌టులకు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఒకే రోజున మంచు ఫ్యామిలీకి చెందిన ముగ్గురు న‌టులు న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి మ‌రి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం గాయత్రి'. మోహ‌న్ బాబు రెండేళ్ళ గ్యాప్ త‌రువాత న‌టిస్తున్న చిత్ర‌మిది.

అంతేకాదు.. క‌థానాయ‌కుడిగానూ, ప్ర‌తినాయ‌కుడిగానూ ఆయ‌న రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. స‌రిగ్గా అదే రోజున మంచు ఫ్యామిలీకి చెందిన మ‌రో సినిమా రానుంది. అయితే అది తెలుగు సినిమా కాదు.. ఆంగ్ల చిత్రం. ఆ సినిమానే బాస్మతి బ్లూస్'. ఇందులో మంచు లక్ష్మి ఓ కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ఆస్కార్ విన్నింగ్ యాక్ట్ర‌స్‌ బ్రీ లార్సన్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా కూడా ఫిబ్ర‌వ‌రి 9నే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్త‌మ్మీద‌.. ఫిబ్ర‌వ‌రి 9 మంచు కుటుంబంలోని ముగ్గురు న‌టుల‌కి స్పెష‌ల్ కానుంద‌న్న‌మాట‌.

More News

కన్నడ కుమారిగా నిధి

రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు, మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఆ ప్రాజెక్ట్‌కి గుడ్‌బై చెప్పిందా?

ఈమధ్య బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కుైవెందనే చెప్పాలి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఆమధ్య ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవిత కథతో తెరకెక్కిన 'నీర్జా' సంచలన విజయం సాధించింది.

ఆ పాట‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ స్టెప్స్ మెప్పిస్తాయా?

వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా 'ఇంటెలిజెంట్'. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ స్వరాలను అందిస్తున్నారు.

చివ‌రి ద‌శ‌లో విక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్‌

వైవిధ్య‌భరితమైన కథాంశాలతో పోలీస్ చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ సిద్ధ హస్తుడు. క‌థ ఏదైనా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విల‌క్ష‌ణ న‌ట‌న‌తో మెప్పించడంలో చియాన్ విక్రమ్ పెట్టింది పేరు.

వ‌రుస సినిమాల‌తో సూర్య‌

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన తాజా త‌మిళ చిత్రం 'తాన సేరంద కూటం'. ఈ చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో అనువదించారు. ఈ రెండు వెర్ష‌న్‌లు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న‌ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.