ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేక విమాన‌మా?

  • IndiaGlitz, [Friday,January 24 2020]

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక ప‌క్క సినిమాలు.. మ‌రో ప‌క్క రాజ‌కీయాల‌తో త‌ల మున‌క‌లై ఉన్నారు. పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన ప‌వ‌న్ ఉన్న గ్యాప్‌లో అంత‌కు ముందు ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకోవ‌డానికి ప్లాన్స్ చేసుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల విష‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

అలాగే ప‌వ‌న్ బీజేపీతో పొత్తు కూడా పెట్టుకోవ‌డంతో ఆయ‌న ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లుసుకుంటున్నాడు. ఇన్ని వ్య‌వ‌హ‌రాల మ‌ధ్య సినిమా చేయాలంటే స‌మ‌యం ఉండాలి. కాబ‌ట్టి ఓ నెల‌రోజుల పాటు పవ‌న్ ఢిల్లీ, హైద‌రాబాద్ ప్రాంతాల్లో తిర‌గ‌డానికి ఓ ప్ర‌త్యేక విమాన స‌దుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడ‌ట‌. దిల్‌రాజు ఓ విమాన‌యాన సంస్థ‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. దీని కోసం కోటి రూపాయ‌లు మేర ఖ‌ర్చు అవుతుంద‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. పింక్ సినిమా షూటింగ్ జ‌రుగుతుంటే.. క్రిష్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వేస్తున్నారు. ఈ నెల 27నే ఈ సినిమాను కూడా ప‌వ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల‌కు సంబంధించి ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు పొక్క‌కూడ‌ద‌ని నిర్మాత‌ల‌కు ప‌వ‌న్ గట్టి వార్నింగ్‌నే ఇచ్చాడ‌ట‌.

More News

వీళ్లంద‌రినీ ఆడించే సూత్ర‌ధారి ఎవ‌రు(`అశ్వ‌థ్థామ` ట్రైల‌ర్‌)

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'అశ్వథ్థామ'.

‘రోజా ప్రిన్సిపాల్.. జగన్ డీన్.. పీఈటీ పృథ్వీ!!’

ఇదేంట్రా బాబూ.. ఇంత తిక్క తిక్కగా ఉంది టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే..

నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్‌.. సేమ్ సీన్!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావుకు..

రానా-తేజ కాంబోలో ‘RRR’!!!

ఇదేంటి.. ఆల్రెడీ కుర్ర స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను పెట్టి దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ‘RRR’ భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారుగా..

క‌రోనా వైర‌స్ ఎలా పుట్టిందో తెలిస్తే షాక‌వుతారు..?

ఇప్పుడు ప్ర‌పంచాన్ని ముఖ్యంగా చైనా దేశాన్ని భ‌య‌పెడుతున్న వైర‌స్ క‌రోనా. ఈ వైర‌స్ చైనాలోని ఉహాన్ న‌గ‌రంలో పుట్టింది.