‘ఆచార్య’ కోసం స్పెషల్ సెట్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఇప్పుడు సినీ పెద్ద‌లు షూటింగ్స్ నిమిత్తం ప్ర‌భుత్వాలు కొన్ని విధివిధానాలో అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ స్టార్స్ షూటింగ్స్ స్టార్ట్ చేయ‌డానికి ఆలోచిస్తున్నారు. ఆగ‌స్ట్‌లో షూటింగ్స్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ బాట‌లో మెగాస్టార్ ‘ఆచార్య’ కూడా ఉంది.

సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖాధికారి పాత్ర‌లో క‌నిపిస్తారు. అందుకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ఓ పురాత‌న ఆల‌యాన్ని పోలిన సెట్ వేయిస్తున్నార‌ట కొర‌టాల శివ‌. సెట్ నిర్మాణంలో ఈ నెల‌లోనే పూర్త‌వుతుంద‌ట‌. ఆగ‌స్ట్‌లో సినిమా షెడ్యూల్‌ను స్టార్ట్ చేద్దామ‌ని అనుకుంటున్నార‌ట ‘ఆచార్య’ మేక‌ర్స్‌. ఈ షెడ్యూల్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా పాల్గొంటుంద‌ని టాక్‌. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం దెబ్బ‌తిన‌నీయ‌కుండా పోరాడే వ్య‌క్తి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. సినిమాలో చిన్నపాటి రాజ‌కీయాంశాలు కూడా ముడిప‌డి ఉంటాయ‌ట‌. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ న‌క్స‌లైట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌న‌డ‌ప‌డ‌తాడ‌ని స‌మాచారం.

More News

తెలంగాణ కరోనా అప్‌డేట్.. తగ్గిన కేసులు..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

‘బిగ్‌బాస్’ తెలుగు అప్‌డేట్ వచ్చేసింది..

బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటేనే ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతుంటాయి. సీజన్ 4 కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. కీలకమైన రెవెన్యూ ధర్మానకు!

ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఎప్పటి నుంచో తమ తండ్రి ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కూతుళ్లు న్యాయస్థానానికి

సహనాన్ని పరీక్షించొద్దు: కరోనా విషయమై హైకోర్టు ఫైర్

తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.